Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అద్వైత శివానందయోగి కథ

39

ముల ధరించి మనోహర మణిభూషవిశేషముల నలంకరించుకొని ఫలపుష్పోపహారములం గైకొని హేమ ముందునడుచుచుండ నాంతరంగికసఖులచే వహింపఁబడిన శిబిక నెక్కి యరుణోదయము కాకమున్న స్వయంప్రభ యగ్గిరిప్రాంతమునకుఁ జేరినది

అప్పుడు చిత్రభానుండును బ్రత్యూషానుగుణ్యంబగు వేషంబుఁదాల్చి చిత్రభాను భూషావిశేషంబుల నలకరించుకొని యుదయగిరికూట సభాకూటంబునకు విచ్చేసెను. అప్పుడల్లంత ప్రాంతంబున చతురంతయాసముడిగి యక్కాంతారత్నము అదే మణికూటము అల్లదే యాశ్రమము. అదిగో మంటపము అని హేమ గురుతుఁ జూపుచుండ నుప్పొంగుచు చూచి మరికొంతదూరము నడచి సఖీ! నీవు ముం దరిగి వారేమి చేయుచున్నారో చూచి సంజ్ఞఁ జేయుము. ఏ నత్తరి పుత్తెంతునని దాని నంపినది.

హేమయు నుపాయ నభాజనములంగైకొని మెల్లఁగా నమ్మంటపము దాపునకుఁ బోయినది అం దయ్యోగినిమాత్రమే జపముఁ జేసికొనుచున్నది. హేమఁజూచి సంతసించుచు విశేషములేమని యడిగినంత నక్కాంతకు స్వయంప్రభ తమ దర్శనమున కరుదెంచినదని చెప్పినది. అప్పలుకువిని యుబ్బుచు గొబ్బునలేచి యా చిగురుబోణి యేదీ ! యేది ! ఎందున్నది చూపుమనుటయు హేమ రాజపుత్రికను రమ్మని సంజ్ఞచేసినది. అప్పు డక్కలకంఠి యుత్కంఠతతో నడుగులు తడఁబడ వడివడి నడుచుచు యమ్మంటపముకడకు వచ్చినది.

చేతుల ఫలము లుంచుకొని వీపున జారుముడి వ్రేలాడ పీతాంబరధారణియై మణిభూషావిశేషములచే మిరుమిట్లుఁ గొల్పుచు యరుదెంచిన యమ్మించుబోడిఁజూచి విస్మయముఁజెందుచు యోగిని తత్కరంబుఁ బట్టుకొని ముద్దువెట్టుకొని యామె నమస్కారము లంది దీవించుచు నిట్లనియె రాజపుత్రీ !నీచారిత్రమంతయు మాయయ్యగారు దివ్యదృష్టిం జూచి వక్కాణించిరి. నీవు రాచపట్టి వనుమాటయేగాని నీవైరాగ్యము శౌనకాదులకు లేదు. నీవుశృంగారభాజనమైనను నీహృదయము జ్ఞానపూర్ణమై యున్నది. నీ చెయ్వులు లీలాకలితములైనను నీ సంకల్పములు ముముక్షు మనఃకల్పములుగదా? నిన్నుఁగాంచుటచే నేఁడు నాకన్నులు సాద్గుణ్యము నందినవి. ఆహా: ఏమినీ సౌందర్యము! ఏమి నీప్రాయము ! ఏమి నీయైశ్వర్యము ! ఒక్కొక్కటియే లోకాతీతమై యొప్పుచుండ గరువముఁ జెందక సిరులఁ దృణముగా నెంచి చక్కదనము లెక్కగొనక పరువము విరక్తి పాలుఁజేసి కాల్నడకతో మమ్ముఁ జూడవచ్చితివి ! నీభక్తికి మేరయున్న దాయని యూరక స్తోత్రములు సేయుచు నమ్మంటపమున నొక దర్భాసనముపైఁ గూర్చుండఁ బెట్టినది.

ఆమె స్తుతిపచనము లేమియు రాజపుత్రికకు హృదయరంజనములు కాలేదు. ----------- స్తోత్రములు కృపాపాత్రములని గౌరవముతో మన్నించి నవ్వుచు పికస్వర ------------------- వెలయ నిట్లనియె. తల్లీ ! నీవనిన సద్గుణంబులు నాయం