యజ్ఞశర్మ కథ
333
అప్పుడు సోమిదేవి యబ్బురపాటుతో భర్తయొద్ద కరిగి నాధా ! మీ రన్నమాట నిక్కువమె సుడీ ? ఏమో యనుకొంటి. నిన్న వీనిలో నొకదానినరికి యమ్మితిని. అది యెప్పటియట్లయొప్పుచున్నది. ఇవి ఆక్షయములు గాబోలునని చెప్పిన నా బ్రాహ్మణుండును వానిం గ్రమ్మరఁ బరీక్షించి యట్లగుట చూచి వింత పడుచు రాజుగారి కష్టార్జితమైనద్రవ్యశుద్ది యెట్టిదో చూచితివా యని భార్యకుం జెప్పుచు దత్ప్రభావముఁ బెక్కు తెరంగుల స్తోత్రముఁ గావించెను. వారుక్రమంబున నా కళికల ఖండించుచు నా కాంచనము విక్రయించి దాన వచ్చిన ద్రవ్యంబున మేడలు గట్టి భూములు సంపాదించి తోటలువైచి యధికవైభవముతో నొప్పుచుండిరి.
ఒకనాఁడు భోజుండు తురగారూఢుండై రాజమార్గంబున బోవుచునద్బుతాలంకార శోభితములైన సౌధంబులంగాంచి యివి యెవ్వరి వని యడగిన యజ్ఞశర్మయను బ్రాహ్మణోత్తముని వని చెప్పిరి.
అతని పేరువిని యోహో ! యజ్ఞశర్మ కడు పేదవాఁడే యింత భాగ్యమెట్లు వచ్చినది ? తాను మిగుల భాగ్యవంతుండై కపటముగా నా యొద్దకువచ్చి యట్లు యాచించెనా ? నిష్కారణముగ నన్ను గూలిపని చేయించెం గదాయని యాలోచించుచు వీధి నిలువంబడి యా బ్రాహ్మణుని బిలిపించెను.
యజ్ఞశర్మ వాకిటికి వచ్చి బోజుం గాంచి వినయ మభినయించుచు దేవా ! లోపలికి దయచేయుఁడు నేను మీ యాశ్రితుఁడ యజ్ఞశర్మనని చెప్పుటయు రాజు విస్మయముఁ జెంది నీ కీసంపద యెట్లుగలిగినది. కష్టార్జితముగాని స్వీకరింపవుగదా ? ఒరునివలన ద్రవ్యము సంపాదించి నాతో నప్రతిగ్రహీతనని చెప్పి నన్ను గష్ట పెట్టితివిగదా? ఇదియా నీ వృత్తియని యాక్షేపించిన నాక్షితిసురుం డిట్లనియె.
దేవా ! నా ఐశ్వర్య మంతయు దేవర దానముఁగావించిన ద్రవ్యమువలన వచ్చినదే ? ఇతరులకడ కెన్నఁడును నేను పోయి యెరంగ. ద్రవ్యశుద్ధియుఁ బాత్ర శుద్ధియుం గలసి యక్షయమైనదని చెప్పిన నమ్మక బోజుం డాపాఱుని బరిహాసములాడఁ దొడంగెను.
అప్పుడు యజ్ఞశర్మ భోజ నరేంద్రుని లోపలకుఁ దీసికొని పోయి ధార్యములో (అగ్ని దాచుకుండములో) నున్న బంగారు ముద్రలఁ జూపించి వారియెదటనే ఖండించి దానిలోఁ గప్పి యెత్తి యెప్పటియట్ల యొప్పుచుండుటం జూపించి యా వృత్తాంత మంతయుం జెప్పి యతని నాశ్చర్యసాగరంబున మునుఁగఁ జేసెను.
అప్పుడు భోజుండు ఆహా ! దానమునకు ద్రవ్యశుద్ది కావలసియున్నది నేను లక్షలకొలఁది ధనము పంచిపెట్టుచున్నను దానిఫలమంతయు నీ డబ్బుల నిచ్చిన