పుట:కాశీమజిలీకథలు-06.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

ఫలమునకు సరిపడదు. పాత్రశుద్ధియు నట్టిదే యని మెచ్చుకొనుచు నా విప్రునివలన నా మంత్రణము వడసి యింటికిఁ జనుచు మార్గమధ్యమున నున్న శివాలయములోని కరిగి ప్రదక్షణముఁ జేయచుండఁ బ్రక్క నున్న మంటపములో నొక యోగిని యొకబాలుని ముద్దాడుచుండెను.

దుర్గకథ

బోజుం డందు నిలువఁబడి యోహో ? ఈ యోగిని సంగముల విడిచియు నీ డింభకునియం దిట్టి ప్రీతి యేమిటికిఁ జెందవలయును? బ్రహ్మచారిణికిఁ బుత్రుం డెట్లు జనియించెనని శంకించుకొనుచు దాపునకుంబోయి దేవీ ! నీ కీ శిశు వేమి కావలయునని యడుగుటయు నా యోగిని యిట్లనియె.

దేవా ! నాకీ బాలుండు సోదరుఁడు. మేనల్లుఁడు. పౌత్రుఁడు. మామ కొడుకు. పినతండ్రి మరది యగునని చెప్పినది. ఆ మాట విని యతండు నివ్వరపాటుతో నిన్ని వావు లెట్లు కలిగినవియో చెప్పుమనుటయు నా యోగిని నేను జెప్పఁ జాలను దైవమే చెప్పవలయునని యుత్తరముఁ జెప్పినది.

అప్పుడు బోజుం డింటికిఁ బోయి మరునాఁడు సభలోఁ బండితుల నందరను రప్పించి యిట్లు చదివెను.

శ్లో. భ్రాతః !: ధ్రాతృవ్య ! పౌత్ర ! శ్వశుర ! సుత ! పితృ వ్యేతితం దేవరేతి.

అనియొక పాదముఁ జదివెను. కవీంద్రులందరు దిక్కు.లు చూచుచుండిరి. అప్పుడు కవిసార్వభౌముఁడు కాళిదాసు ఇట్లు పూర్తి గావించెను.

శ్లో. జారోత్పన్నౌ విసృష్టౌ తనయదుహితరోదంపతీధైపయోగాత్‌ ।
    యోగినాగహిన్‌తాసాతదనుగమన శాద్యోగినీత్వం ప్రపెదె ॥
    పశ్చాద్భార్యాకృతాంబాజినితమథశిశుంలాలయంత్యబ్రవీత్సా ।
    భ్రాతర్భాతృవ్య పౌత్రశ్వశురసుతపితృ వేతితందేవరేతి.

ఒక గ్రామమున దుర్గయను వెలఁది గలదు అది జారిణియై తొలిప్రాయముననే భర్తనువిడిచి మరియొకగ్రామముపోయి యుపపతితోఁ గాపురము జేయుచుండ దండుఁడను కొమరుం డుదయించెను. ఆ శిశువుం బెంచినచోఁ దనయౌవనమునకు భంగము గలుగునని యా దుర్గ యా పాపనువిడిచి మరియొక గ్రామమువోయి యందొ