అద్వైత శివానందయోగి కథ
37
స్వయముగా నా పొలతి సౌశీల్యముం గొనియాడెఁ గదా! ఇల్లును వాకిలినివిడచి బంధువుల వదలి తనతోఁ గుమ్మరుచున్న నాతో సైత మింతవింతగా మాటాడడు. నిక్క మక్కలికి యట్టిది కాఁదలంచెదను. నిన్నేమిటి కచ్చెలువఁ బుత్తెంచినది. ఆ సర్వజ్ఞు డెరింగినను నాకుఁ జెప్పఁడుగదా? నాకామెతో మైత్రిజేయవలయునని యున్నది. సద్గోష్టియు సజ్జనసహవాసమును ముక్తికారణములు గదా? యని యడిగిన సంతసించుచు నే నీవృత్తాంతమంతయుంజెప్పి వెండియు నిట్లంటి.
దేవీ ! పరిచయము గొంచమైనను నీయౌదార్యము ప్రాగల్బ్యమును గలుగఁజేయు చున్నది. తెలియకడిగినమాటఁ దప్పుగాగణింపక క్షమింపుము. నీవును నా సఖురాలిపోలిక బ్రాయమునఁ మిక్కిలి చిన్నదానవు? రూపము జగన్మోహనమైనది. ఇట్టితరి వైరాగ్యవృత్తిని వర్తించుటకుఁగతంబేమి? మరియు నీ తాపసకుమారుండు మారునింబోలియున్న వాఁడు చక్రవర్తి లక్షణములన్నియు వీనియందు వర్తించు చున్నవి. ఇట్టి తొలిప్రాయమునందీ మహానుభావుండు మునివృత్తింబూనుట చిత్రముకాదా? పూనెఁబో ఇంతలో నింతమహిమ నెట్లు సంపాదించెను. మహాత్ములసామర్ధ్య మగోచరముగదా? వీరి యభిఖ్యమెట్టిది? కులమెయ్యది? జన్మభూమియేది? నీతల్లిదండ్రులెవరు? నీవీయోగికెప్పుడు శిష్యురాలవైతివి? మీ వృత్తాంతము వినుటకు నేనర్హురాలనేని వివరింపుమని యెంతయో నైపుణ్యముగాఁ బ్రార్థించితిని.
నామాటవిని యాబోటి బాలా? వేరచెప్పనేల? నాకథయంతయు నీ సఖురాలికథపోలిక వహించియున్నది. ఈగురునిపేరు యద్వైత శివానందయోగి ఈయన గొప్పకులమువా డగుటకు సందియములేదు. బాల్యమున శంకరుండు ప్రత్యక్షమై మంత్రోపదేశము చేసెనట. దానంచేసి విరక్తుండై లోకోపకారార్ధమై క్రుమ్మరుచున్నవాఁడు. రూపవంతుఁడై యభిజ్యాత్యుండై విద్యాశాలియై ప్రాభవార్హుండయ్యు విషయ పరాఙ్మఖతగలిగి గర్వమనునది యెరుంగక వస్తువిరాగముతోఁ దపము గావించుచున్న యీమహాత్ముని ప్రభావము లోకులవలనవిని నేనంతకుమున్న జనించియున్న వైరాగ్య ప్రవృత్తితో దత్వశ్రుజోతుకనై గురునన్వేషించుచుంటిం గావున నీతండ సేవ్యుండని నిశ్చయించి బంధువులవిడనాడి యొక్కనాఁడు మావీటి దాపున శివాలయములో నున్నతరి సంసారసాగరమునకు దరివై తరింపఁజేయుమని ప్రార్థించుచు నీతని యడుగుదమ్ములంబడి శరణువేడుకొంటి. కరుణా బంధురుండగు నిమ్మహాత్ముండు మదీయబుద్ధి పారిశుద్ధ్య మంతయు నంతర్దృష్టిఁ గనుటంజేసి నాశ్రుశూష కంగీకరించి మంత్రోపదేశముఁ గావించెను. నాఁటగోలె సహోదరుగాఁ దండ్రిగాఁ జూచుకొనుచు నీయోగి వెనువెంట నరుగుచుంటి నా వెనుక వాల్లంటులు పెక్కండ్రు శిష్యురాండ్రుగాఁ జేరుటకువచ్చిరిగాని వారినెల్ల నిరాకరించెను ఈతని చెంత కాంతాప్రసక్తి యించుకయుం బనికిరాదు. శ్రీశుకాదులకైన నించుక వంక యున్నదిగాని పరకాంత వైముఖ్యమున నతని కేలోపమునులేదు ఈతని చిత్తవృత్తి