పుట:కాశీమజిలీకథలు-06.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కమల కథ

309


తొంబది యాఱవ మజిలి

కమల కథ

అమ్మా ! నేనీ నడుమ సఖులతోఁ బుడమికరిగి భైరవసరస్సులో జలకమాడుచుండ గట్టునఁ బెట్టిన నా పుట్ట మెవ్వరో యెత్తుకొనిపోయిరి. ఎంత వెదకినను వస్త్రచోరుడు కనంబడలేదు. నా సఖురాండ్రందరు నన్నుజూచి నీ చీరఁ దీసికొని పోయినవానికి నీవు భార్యవై యుండవలసివచ్చును. ఇఁక నీవు భూలోకవాసినివే. దేవలోకము నీకుఁ బ్రాప్తిలేదని పరిహాస మాడుచు నన్ను మిక్కిలి పరితపింపఁ జేసిరి.

నేను దిగంబర నగుట నందు గదలక వేరొక పుట్టముఁ దెచ్చి పెట్టుడని యనేక విధంబుల బ్రతిమాలుకొంటిని. వారిలో నొక మచ్చెకంటి నా కంటికి నీరు దెప్పించి యెట్టకే దనపుట్టము సగము చీరి యిచ్చినది. ఆ వస్త్రఖండముఁ గట్టికొని యిక్కడికి వచ్చితిని. వారు సెప్పినట్లు జరుగదుగదా ? యని కన్నీరుఁ గార్చుచు గమలయను గంధర్వకన్యక ప్రజ్ఞావతి యను తన తల్లితోఁ జెప్పుకొని విచారించినది.

ఆ మాట విని ప్రజ్ఞావతి అయ్యో ? ఎంతమోసము జరిగినది. వా రన్నమాట వట్టిదికాదు సత్యమైనదే? నీ వివాహము నిమిత్తమై యెంతో ప్రయత్నము చేయుచుంటి. నా మనోరథము తీరదు గాబోలు. నేడు మహాలక్ష్మీ సేవ నిమిత్తమై వైకుంఠమున కరుగవలసి యున్నది. నీవు గూడ నాతో రమ్ము. అమ్మహాదేవినడిగి యీ సందియముఁ దీర్చుకొందము ఆమెపేరే నీకు బెట్టితిని. సేవకులయం దామెకు మంచి యనురాగము గలిగియున్నది. అని చెప్పుటయుఁ గమల సంతసించుచు నాడు చక్కగా నలంకరించుకొని తల్లితోఁగూడ వైకుంఠమునఁ కరిగినది.

ప్రజ్ఞావతియుఁ దనకు నియామకమైన చామరగ్రహణ సేవ కావించి యామెం బ్రసన్నురాలిం జేసికొని తనపుత్రిక నామె పాదమూలమునఁ బడవైచి దేవీ! ఇది నీ దాసురాలు కమల. దీనికిం దగిన వరుఁడెవ్వడును గనంబడకున్నాడు. గంధర్వకుమారు లెందరు వచ్చి యడిగినను సమ్మతించినదికాదు. అది యట్లుండ మొన్న భూలోకమున కరిగి జలక్రీడల సందడిని పుట్ట మెట్లు పోయినదో తెలిసికొన లేకపోయినది. ఆ వస్త్రచోరునికే భార్యయై యుండవలసి వచ్చునని కొందరు చెప్పు