పుట:కాశీమజిలీకథలు-06.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

288

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నెట్లు పోవలయునని యాలోచించుచుండఁగా నిరువురు కూలివాండ్రు వచ్చి అయ్యా మేము‌ పేదవాండ్రము మూటలు మోచికొని మీ వెంబడి వత్తుము. బత్తెము పెట్టినఁ జాలని యడిగిరి.

ఆ మాటలు సత్యములని నమ్మి వారిరువురు మాకు మూటలు లేవు. దారిఁ జూపినంజాలు. మీకుఁ దగిన పారితోషిక మిత్తునని చెప్పిరి. అందులకు వాండ్రంగీకరించి యతివినయముఁ జూపుచు ముందు నడచుచు గంటకములు నేరుచు నేర్పరి తనంబున గొంతదూరముఁ దీసికొనిపోయి యొక మహారణ్యములోఁ బ్రవేశ పెట్టిరి. లీలావతి పురుషవేషముతో నడుము బిగియించి కరంబునఁ గరవాలము గ్రాల సింహగమనంబున వారి వెంట నడచుచుండెను. అమ్మహారణ్యంబున నొకలోయలోఁ గొందరు కోయవాండ్రెదురై నిలునిలుండని వారినదలించిరి. అప్పుడు లీలావతి ముందు నిలిచి మమ్మేటికి నాటంక పెట్టిరి? మీ యభిప్రాయమేమన వాండ్రు మీ యొద్ద సొమ్ములున్నవి. అందుఁబెట్టి పొండని పలికిరి. ఆ కలికి తమవెంట వచ్చిన కూలివాండ్రు వారితో మాటాడుటఁ జూచి కోపావేశముతో నా యిరువుర శిరములు ముందుగ నరికి లేళ్ళగమికురుకు సింగంబు చందంబున నా యాటవికులపైఁబడి నరకుటయు యధాయధలై యా యధము లందరుఁ బారిపోయిరి . అమె పౌరుషముఁ జూచి యా వర్తకుడు వెరఁగుపడుచు వెనువెంటఁ దిరుగంజొచ్చెను. అట్లడ్డువచ్చిన మ్రుచ్చులనెల్ల , గడతేర్చి యాపడఁతి. తెరవుగానక నలుమూలలు సూచుచు గమ్యస్థానము గురించి విచారించుచుండెను.

అని వచియించిన మణిసిద్దుండు తత్కధాశేష మనంతకావసధమ్మున నిట్లు చెప్పదొడంగెను.

తొంబదినాలుగవ మజిలి.

భోజకుమారుని కథ

రాజపుత్రా ! వత్సరాజు మీ తండ్రి నా చప్పినసు చేయుట శంగినతం ట్లు సంర సంతులు, నకలు రవూ.౮4 ౫ గగటిసునల్ల కందిన చురపటు ప రోధన షా. వవపడ ముం. నడుం మప మంతిలళ్యరు.ంఎ ిపగసము. సమయము నేది సిన్నందు రిపింటంనం ఇ సీ పిసతం డి యనుభంంపం*లడా 1 సబల విరోధము కలుగఁజేసి దేశమునఁ గలతలు పుట్టించెదను. కర్తవ్య దెలియజేసెద. గూఢముగా నలకాపురంబునకుఁ జనుమని బుద్దిసాగరుండు భోజకుమారున కుపదేశించుటియుఁ దదనుమతి ననుసరించి