(37)
భోజకుమారుని కథ
289
యా రాజపుత్రుఁడు తురగారూడుండై నాటి వేకువజామున ననుచరులతోఁగూడ నొక యడవి మార్గంబునంబడి నడువఁ దొడంగెను.
అల్లంత ప్రొద్దెక్కువరకుఁ దురగమునుఁ జురుకుగా నడిపించి యా రాకుమారుఁడు చండభాను కిరణంబులు సోకి చరణంబులు తరుచ్ఛాయాచరణంబు నభిలషింప ననుచరులలో నోరి ! అలకాపురమునకు మార్గము మీరెఱుంగుదురా ? ఎంత దూరమున్నది ? పోయినకొలది యరణ్యగమ్యముగాఁ గనంబడుచున్న దేమి ? ఒకచోటఁ గొంతసేపు విశ్రమించి యేగవలయును. నాకీ పయనము చాల బడిలికగా నున్నది. హుటాహుటి నడలచేఁ బెద్దదూరము వచ్చితిమని పలికిన నాకింకిరు లిట్ల నిరి.
రాజపుత్రా ! మమ్మల కాపురముఁ గ్రొత్త దారిం దీసికొని పొమ్మని ప్రధాని నియమించెను. ఈ త్రోవ తరచు జనులు నడచుచున్నది, కాదు. పది దినములకుగాని మన మలకాపురముఁ జేరలేము. ఆహార పదార్థములు తెచ్చితిమి. నీరుగల తావున నిలిచి భుజింతురుగాక. విశ్రాంతి వహించియే పోవచ్చును. తొందర యేల? మీ రతిసుకుమారులు గదా? అని పలుకుచు నొక చెట్టునీడ నా బోజుని విశ్రమింపఁజేసి ప్రాంతభాగముల కరిగి జలముఁదెచ్చి యుచితాహారమున నతనిం దృప్తుఁగావించిరి. అతండు విశ్రాంతిఁజెందిన పిమ్మటఁ గ్రమ్మర బయలుదేరి రాత్రికే కొండపల్లి నైనఁ జేరవలయునని తలంచిరి కాని యట్టికొట్టిక యెద్దియునాఁడు గనంబడినదికాదు. చీకటి పడకమున్ను యొక పొదరిల్లు బాగుఁజేసి పల్ల వశయ్యఁ గల్పించి రాజపుత్రునందుఁ బరుండజేసి పరిచారకు లిరువురు నాయుధ హస్తులై కాచికొని యుండిరి.
బోజుండారాత్రియెల్లఁ బినతండ్రి కావించిన దుర్నయమును గురించి విచారించుచు నెట్టకేల దెల్లవార్చెను. సూర్యోదయంబుఁ గాల్యకరణీయంబులు తీర్చికొని బయలుదేరిరి. ఆ మార్గమొక కొండలోయకు దీసికొని పోయినది. మార్గముఁ దప్పితిమని యా సేవకులనుకొని తొట్రుపడఁజొచ్చిరి. ఒక కొండ కాల్వదరిని మధ్యాహ్న కృత్యంబులు నిర్వ ర్తింపం జేసిరి. నాటి సాయంకాలమున కాయడవి దాటక పోయితిమేని క్రూర సత్వంబులవలన ప్రమాదము గలుగక మానదని తలంచుచు వెంటనే బయలుదేరి యతివేగముగాఁ బయనము సాగించుచుండిరి. కొంతదూరము పోయినంత నొకవటపాదపంబు శాఖాసమూహముచే నలుదెసల నావరించి దిక్పతుల నగరంబుల కరుగ నమరించిన రాజమార్గమోయన విరాజిల్లుచున్నది. శీతలసాంద్రచ్ఛా యాభిరామంబగు నా భుజముక్రింద భోజుండనుచరులతోఁ గూడఁ గొంతసేపు విశ్రమించి పయనంబునకైఁ దొందరఁ జేయుచున్న కింకరులతో నతం డిట్లనియె.
ఇది మహారణ్యము. ఇందు మనుష్య సంచారము లేదు. ఇంతలోఁదెరపి