లీలావతి కథ
287
గావించితివి. లేకున్న నీపాటికి నన్ను వీండ్రు కడతేర్చియుందురు. నన్ను వెనువెంటఁ దీసికొనిపోయి జనపదంబుఁ జేర్చుమని పలికిన నక్కలికి యిట్లనియె.
నీ వెవ్వడవు? ఎందుఁబోవుచుంటివి ? నీయొద్ద నేమియు లేదుగదా ? నిన్ను వీండ్రేమిటికి పీడించుచుండిరని యడిగిన నా వర్తకుం డిట్లనియె. అయ్యా ! నా కాపురము ధారాపురము. నేను రత్నవర్తకుఁడ. నా పేరు రత్నపాలుఁ డందురు. రత్నములు మూటఁగట్టికొని గుఱ్ఱముపై వైచి యలకాపురంబున కరుగుచు దారి దెలియక నీ యడవిలోఁ బడితిని. ఇందు మ్రుచ్చులు నన్నుగాంచి యడ్డగించిరి. అప్పుడు నేనొక యుపాయముఁ జేసి గుఱ్ఱమునందు విడిచి పారివచ్చి వారికిఁ దెలియకుండ నా మూటనొక వృక్షమూలమునఁ బాతివైచితిని. ఆ గుఱ్ఱముపైనున్న మూటలో నేమియు లేకుండుట విమర్శించి నన్నుఁ బట్టుకొనుటకుఁ దరిమికొని వచ్చిరి. నేనంతకుమున్నె యాముల్లె దాచితిని కావునఁ బట్టువడినది కాదు. నన్నా మూటఁజూపుమని నిర్భంధించుచున్నారు. ప్రాణములై న విడువ సాహసించితిని గాని మూటజాడఁ జెప్పితిని కాను. ఇంతలో మీరు వచ్చి విడిపించితిరి. ఇదియే నా వృత్తాంతమని చెప్పెను.
అప్పుడు లీలావతి నవ్వుచు వర్తకుల లక్షణము లిట్లె యుండును. ఆ మూట యెందున్నదో నీవు చెప్పఁగలవాయని యడిగినఁ జెప్పగలను అక్కడిఁకి బోవుదము రమ్ము. మీ చెంతనున్న నాకు దొంగల భయము లేదని పలుకుచు నొక చెట్టు మొదటికిఁ దీసికొనిపోయి యందుఁ బాతియుంచిన రత్నముల మూటఁ దీసి చూపుచు నిఁక బోవుదము లెమ్మని పలికెను. లీలావతి యా మూట నందుకొని హయముపైఁ బెట్టికొని యతండు తనతో నడచుచుండ నా కత్తలాని మెల్లగా దోలుచు వర్తకుఁడా ! నీవు ధారానగరము బయలుదేరి యెన్ని దినములై నది. మీ రాజు కుశలియై యున్నవాఁడా? యని యడిగిన నతం డిట్ల నియె.
అయ్యా ! నే నిల్లు వెడలి యిరువది దినములైనది. ఇప్పటి మా రాజు కడు క్రూరుఁడు. అన్నకుమారుని భోజుఁడను వానిని రాజ్యలోభంబునఁ జంపించి పిమ్మటఁ బాశ్చాత్తాపముఁ జెందుచు నగ్నిఁ జొచ్చుటకు సిద్ధపడియెను. ఎవ్వడో సిద్దుఁడు వచ్చి భోజుకుమారు నారునెలలోఁ బ్రతికించి తీసికొనివత్తునని చెప్పుటచేఁ జావక నా యాసతో నుండెను. తరచు నేను దేశములు తిరుగుచుండుటచేఁ బురవిశేషములు నాకంతగా దెలియవని చెప్పెను. అమృత బిందువులువలె నా మాట చెవులకు సోకియాకోకస్తని యుబ్బుచు నావర్తకుని బలుమా రామాటయే యడుగుచుండెను.
అట్లు వారు మాట్లాడికొనుచు నాటి సాయంకాలమున కొకపల్లె జేరిరి. గుఱ్ఱమునొకచోటఁ గట్టి వారొక యింటిలోఁ బండుకొనిరి. మరునాఁడు లేచిచూడ ------------ గనంబడలేదు. ఎవ్వరో తోలికొని పోయిరని నిశ్చయించి పిమ్మట