32
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
తల్లీ ! యింతయేల మీ చరిత్రము చలచికొనుఁడు. సామ్రాజ్య సుఖసంపన్నులయ్యు గొన్నిదినంబులు సంతతిలేక చింతించిరి. నే గఁలగిన పిమ్మట నాయందు ప్రాణములుంచుకొని మదీయ క్లేశములన్నియు మీదవైచికొని పరితపించు చుంటిరి. నేను పెండ్లియాడితినేని నా మగనివలనను సంతతివలనను గలిగెడి యిడుములకు తుదిమొదలులేదు. ఈరీతి సంసారములో జింతాపరంపరలు బాధించుచునే యుండును. ఇక నిశ్చింతయెప్పుడో చెప్పుము. నీవు పెండ్లి యాడి పడిన యిడుమలు చాలక నన్నుఁగూడఁ బెండ్లి యాడి కష్టములఁ బడుమని బోధించెదవా? నాయందు గలిగిన యక్కటికమున కిదియా ఫలము! మీరు సంతోషములని తలంచెడు నవి యన్నియు దుఃఖహేతువులుసుమీ! తల్లీ! నీకు పదివేల సమస్కారములు. నాకు పెండ్లివద్దు. పిల్లలువద్దు. రాజ్యమువద్దు. ఈ యుద్యానవనమే తపోవనము చేసికొని స్వయంప్రభవోలె తపంబుజేసికొనుచుండెద ననుగ్రహింపుమని మృదు మధుర వేదాంత వాగ్గుంభనలఁ బ్రత్యుత్తర మిచ్చిన పుత్రికం గౌగలించుకొని రాజపత్ని గోలున నేడ్చుచు నిట్లనియె.
హా ! తల్లీ ! నిన్నూతగాఁ బూనికొని దేహయాత్ర నడుపుకొనదలంచిన తల్లి దండ్రుల శోకసముద్రమున ముంచి నీపూనిన వ్రతమేమి సాద్గుణ్యమొందెడిని అడవిని వసించు తాపసులు మాత్రము పెండ్లి యాడమానిరా ? సతులకుఁ బతి దేవతావ్రతముకన్న నీమము గలదా? పతివ్రతలై యరుంధతి లోనగువారెట్టి ప్రభావము సంపాదించిరో యెరుంగవా సంసారము నాటకమువంటిదేయైనను పాత్రలు నద్వేషానుగుణ్యముగ నభినయించుట యుచితముగదా? పెండ్లి యాడి పతివ్రతవై నేమంబుల నెక్కుడు సామర్థ్యము సంపాదించుకొనరాదా? నీమది జక్కగా విచారించు కొనుము. క్రోధాదులు శృతువులని చెప్పితివే? నీవా కోపమేమిటికి విడిచితివికావు. వీణావతి వీణ విరుఁగఁగొట్టితివఁట. కోపముననా శాంతముననా చెప్పుము. కన్ను లింకనుఁ ఉన్న గరువలేదు. పెద్ద'పోకలు ఐ'పుచుంటిని. ఈ పేను సీకెందు నిన్నడియేకాని దానిపాటి తెలివితేటలు నీకుగలిగినవికావని మందలించుచు మొతలోని హారములు సవరించుచుఁ డటాలున నేడియో జ్ఞాపకమునిచ్చి అమ్మా? గత్నహారము లేదేమి? అదియు విరక్తిచే నిమితిలో యందుగన వనీ భర్తగకుండ తీసిపారవేసితివా యేమి? నీ ముడ్రికా పేటిక నుండి సంగ్రహించి సీరంగముల ప్రనిత కక్కరలేనిచో నది యిటు తెమ్ము. తీసికొనిపోయెదనని చెప్పిన వి టీ అయ్యగా కాహారము ముదీకాపేటికలోని బెట్టుటకుఁ గారణ ఏమి? సం చేసినా రక్తి కలవని చెప్పినదిగాన జ్ఞాపకములేదు. ఆది నింపనీయకనే గడుపులయు హేమ స్వయంప్రధ మొగము