పుట:కాశీమజిలీకథలు-06.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

స్వయంప్రభా విరక్తి కథ

31

అప్పుడు పరిజనులందరు తొందరపడుచు పీఠములు సవరించిరి. స్వయంప్రభయు హేమయు దిగ్గునలేచి నమస్కరింప దీవింపుచు నామె వారినెల్లఁగూర్చుండ నియమించి కూఁతు గద్దియదాపునకుఁ తనపీఠము లాగికొని శిరంబుడుకుచు కన్నుల భాష్పంబులుగ్రమ్మ నిట్లువాక్రుచ్చినది. అమ్మా ! నేనును నీతండ్రియు సంతతి నిమిత్తము పడిన యిడుము లెవ్వరును పడలేదనియుఁ ఒడబోవరనియుఁ దృఢముగా నుడువగలము తుదకు స్వయంప్రభాదేవి యనుగ్రహమునఁగదా నీవు గలిగితివి. నీపై గొండంత యాసపెట్టికొనియుంటిమి. నీవు పుట్టనిదివోలె మీతండ్రి నీకు మంచిమగనిని తేవలయుననియుఁ బెండ్లి దినములలో గొప్పవైభవము సేయవలయుననియు నూరక యుర్రూటలూగుచున్నారు. నీకెప్పుడు ప్రాయమువచ్చును ఎప్పుడు పెండ్లి చేయుదును. ఎప్పుడు దౌహిత్ర లాభము గలుగునని గడియ యుగములాగున గడుపుచున్నారు. నేటికి నీకు యుక్త వయసువచ్చినది కులకళారూపవైభవముల ననురూపుండైన వరునివరించి యౌవనము సార్దకము చేసికొనుము. సంగీతము పాడిన బోగముదాని వీణ విరుఁగఁగొట్టితివట. ఇదియేమి యాగడము! పెండ్లిమాట తలపెట్టిన తిట్టుచున్నావఁట యిదియేమి పాపము ఈ మార్గమెవ్వ రుపదేశించిరి? అని పెద్దతడపు యుక్తియుక్తముగా సుపన్యసించినది.

స్వయంప్రభ యామాటలన్నియువిని యేమియుమాటాడక తలవాల్చుకొని కూర్చుండుటయు హేమ సఖి! ఇప్పుడమ్మగారి మాటల కుత్త రము సెప్పవేమి? మాయెుద్ధ నేమేమో చదివెదవే నీవేదాంత మీమెకుఁగూడ గొంచెము విసుపింపు - మందలి మంచి చెడ్డలామెయే విచారించుం గాకయని పలికిన విని యక్కలికి తలయెత్తి యిట్లనియె.

అమ్మా! మద్యాసక్తులకు మద్యంబువోలె విషయాసక్తుల కీ ప్రపంచమెంత యేని రుచిగాఁ గనంబడును. వివేకించిచూడ నంతయు నసహ్యమేసుమీ ! పేగులతో తెల్లఁబడిన యెముకలకు రక్తమాంసములు పూసి పైన చర్మముగప్పి మూత్ర పురీషంబులచే నిండింపఁబడిన యీ శరీరమెంత మనోహరమైనదో విచారింపుము. పంసభూతవికారంబైన యీదేహంబునంగాక యభిరుచి వహింతురా? శరీరగుణంబులగు మదమాత్సర్యాదులు నయ్యింద్రియార్ధములను జ్ఞాతులని తత్వవేత్తలు చెప్పుచున్నారు. మోహారణ్యంబుననడచు పరధికునకు వ్యాఘ్రాదిక్రూరమృగంబు లెట్లుపద్రవ కరంబులో బాను క్రోధాది గుణంబులÄ మనుష్యులను మోసము చేయునవియని మహర్షులు చెప్పి చిన్నారు. పిల్లలకు తల్లిదండ్రులే శత్రువులు. పుట్టినదిగోరి వాండ్రకు జ్ఞాన సింహ మగకియ నాలని యుఎల్లలనియు గాపురమనియు సంభోగమని ము మించి ఎత్తుకున్నారు. 37 ' దముహర్ర నమ్మకం యూన్ సిల్లలంగిని జ్ఞానయు ఎంచుకున్నారు. 81