264
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
మన్నింపవలయును. వసుంధరుని మామ కుముద్వంతుండు నాకుఁ బినతండ్రి కుమారుండు. వసుంధరుని పాండిత్యప్రకర్షము మేము విని యుంటిమి. అతండు లోకప్రసిద్దుండు, రామలింగ కవికుమారుఁడు వానిశిష్యుడఁవు. నీ వంతకంటె నధికుండవైతివి. నీకుఁ గొన్ని యగ్రహారములీయఁ దలచికొంటి. నాయొద్దఁ బండితుఁడవుగా నుండుమని కోరికొనియెను.
అని వినిపించి యయ్యతి ప౦చాననుండు తరువాత చరిత్ర మవ్వల నున్న యునికియం దిట్లు చెప్పఁదొడంగెను.
తొంబది యొకటవ మజిలీ
మంజరికా ! ఈ సరోజిని కౌముది పోలికగా నున్నది చూచితివా? ఈ చిన్నది యింద్రదత్త కేమి కావలయును ? ఒకవేళ నా బాలిక బ్రతికి యిక్కడికి రా లేదుగదయని పాటలిక చెప్పిన విని మంజరిక అవును నాకును సందియము కలుగు చున్నది. నడక యచ్చుగ నట్లే యున్నది. ఇప్పుడు రాజపుత్రిక యొద్దనే ముచ్చటింపుచున్నది. దాపునకుఁ బోయి యాకర్ణింతము రమ్ము. యని పలుకుచు మంజరికయుఁ బాటలికయు మాటునఁ గూర్చుండి వారి మాటలు వినుచుండిరి. అప్పుడు సరోజిని రాజపుత్రికతో నిట్లు చెప్పుచుండెను.
దేవీ ! నేనించుకయు నసత్యము లాడుదానఁ గాను. ఘటదత్తుఁడు త్తమవంశ జాతుఁడు. వసుంధరుఁడను రాజునొద్దఁగొన్ని నాళ్ళుమంత్రి యైయుండి యాతని కేదియో కోపమువచ్చిన నందు నిలువక దేశాటనముఁ జేయుచు మహారణ్యమధ్యమునఁ బడియుండి యెకనాఁడు దొంగలచే రక్షింపఁబడెను. వాండ్రు తమవృత్తిఁ గైకొనుమని నిర్భంధించిరి. ఇష్టము లేకున్నను వారితోఁ గొన్ని దినములు తిరిగెను. చంద్రవతి యను వేశ్య నన్నుఁ బెంచికొన్నదని నీకిదివరకే చెప్పితినిగదా ? నన్ను వేశ్యా వృత్తికై బోధించినది. నే నంగీకరింపక యెదురాడుచుంటిని. ఘటదత్తునకు రాజవేషము వైచి యానలువురు దొంగలు మాయింటికిఁ దీసికొనివచ్చిరి. నాఁడు చంద్రవతి నన్నుఁ బెద్దగా నిర్భంధించి వానితోఁ గూడుమని బోధించి వాని నా గదిలోనికి బంపినది. నేను దుఃఖించుచు వాని పాదముల మీదఁ బడి నా చిత్తవృత్తి నెరింగించితిని.
అతండు నన్నుఁ దోబుట్టువుగాఁ దలంచి మన్నించెను. అంతలో దొంగలు లోపలికివచ్చి వానిందిట్టుచు నన్ను బట్టికొని యొకడెత్తు కొనిపోయెను. గ్రామ ప్రాంత కాంతారమున నన్ను బలవంతము సేయుచుండ నతండు వారినందరం గడతేర్చెను. పెక్కులేల ? అతని పరాక్రమము చూచి తీరవలయును అని తలచి కథ ------------ కథయుం జెప్పి రాజపుత్రీ 1 మా చరిత్ర యింతయున్నది. సామాన్యముగా నతని దొంగయనియు నన్ను లంజయనియుఁ దలంపక మానరు. సత్యము చూచిన నతని వంటి బలశాలియు గుణశాలియుఁ బుడమిలో లేడు. అతఁడే నీకుఁ దగినవాఁడు. నీవే వానికిఁ దగుదువు. నీ వీవిషయమై చింతింపవలసిన పనిలేదని చాలసే వుపన్యసించినది.