(34)
కవి కంఠకౌక్షేయుకుని కథ
265
ఆ యుపన్యాసము విని మంజరికయు, బాటలికయు, నురములమీదఁ జేతులు వైచుచు అమ్మయ్యో ? ఘటదత్తుఁ డిక్కడికే వచ్చెనా. ఈ రాజపుత్రిక వాని వలచినదని తోచుచున్నది. అతండు రాజపుత్రుఁడని తెలిసిన మిక్కిలి సంతసింపఁ గలదు. జెప్పుదమా? చెప్పినచో మన ద్రోహము బయల్పడ గలదు. మన కంత యవసర మేల వచ్చినది? చెప్పరాదు. ఈ చిన్నదియు గౌముదికూఁతురే అయ్యారే ? దైవఘటనము. ఇద్దరినొక చోటికే చేరఁదీసెనుగదా ? అని యిరువురు ముచ్చటించుకొనిరి.
అప్పుడు పాటలిక యోసీ ! మంజరికా ! ఈ వృత్తాంతము చెప్పుదనుక నా నాలుక గులగుల లాడుచున్నది. కడుపులో నిలుచునట్లు లేదు. దీన నింద్రదత్త కేమి లోపమున్నది ? చెప్పుదును. అని యడిగిన వద్దు వద్దు అని వారించినది. అయ్యో ! మనము వచ్చుచున్నట్లు రాజపుత్రికతో నావార్త చెప్పవలదని యెంత యాపినను నిలువకున్నది. నే నేమి చేయుదును? ఎట్లు చెప్పవలయునో యుపాయము బోధింపు మనుటయు మంజరిక యిట్లనియె.
ఈ కథఁ జెప్పిన మనకు శిరచ్ఛేదము కాదా ? మనము కావించిన పని సామాన్యమా ? ఇరువురి శిశువులం జంప బూనితిమి. వారి జీవితములు దృడమైనవి. కావునఁ జావరైరి. పైన దైవము లేడాఁ మన ప్రయత్నములు వృధలు. వృధలు. మన కించుకయు స్వతంత్రము లేదు. నా కీ ద్రోహకృత్యములు మొదటినుండియు నిష్టము లేదు. నీవును మా తల్లియు నింతఁ జేసిరి. మన చేసిన మోసము మనలనే కొట్టినది. స్థానభ్రష్టుల మైతిమిగదా? నిజ మెరింగిన వీరుమాత్ర మిందుండ నిత్తురా ? తిరిపె మెత్తుకొని తిరగవలసి వచ్చును. కావున మౌనము వహంచి యుండుమని యెంతయో బోధించినది గాని స్త్రీ చాపల్యంబునం జేసి యొకనాఁడా పాటలిక యింద్రదత్తతో రహస్యముగా నిట్లనియె.
రాజపుత్రీ ! ఘటదత్తుని గురించి నీ వూరక వితర్కించి యా చిన్నదాని నడుగుచుండ వినుచుంటి. నా నెరింగిన విషయ మితరులు వేరొక తెరవున శంకించుకొనుచుండనిజము చెప్పువరకు నెవ్వెరికిం దోచదుగదా ! అతని వృత్తాంతము నాకు సొంతముగాఁ దెలియును. విను మతండు కృష్ణదేవరాయల దౌహిత్రుండు వసుంధరుని కుమారుండు. అతండు పుట్టినప్పుడు దాది కపటముఁ జేసి కందకములోఁ బారవేయఁ దీసికొని పోవుచుండ శారదయను బ్రాహ్మణపత్ని వానిం గైకొని పెంచుకొన్నది. అక్కథ కడు గూఢమైనది. ఆ దాదివలన నాకుఁ దరువాత దెలిసినది. ఆతండును దనజననోదంత మించుకయు నెరుంగఁడు. ఈ సరోజినియుఁ గౌముది కూతురు. ఈ
దాసీ :పకంకుత్వుముననే బరినినున సు సంజీోషాంబుంథి కిట్రీల;పుల నోలండుటు సిటి టు పాపలా । సత్య ఏష ఏమునచో నావంటి ధన్యులు పుతమిలో 'కేదుగదా। ఎట్టుమై