Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవి కంఠకౌక్షేయుకుని కథ

263

నీవంటి పండితుని దర్శనము జేయగలిగితిని. నా ఉత్సాహము తీరినది. చాల సంతోషించితిని. నీ యభీష్ట మెద్దియో చెప్పుము. నీ కోరిక దీర్చి కృతకృత్యుడ నయ్యెదనని యత్యంతాదరముతో బ్రార్థించిన సంతసించుచు ఘటదత్తు డిట్లనియె.

దేవా ! నీ త్యాగము వెనుక నే పెద్దగా వింటని. ఒక దొంగంబట్టికొనిన వానికి మూడు గ్రామములిత్తునని బ్రకటించితివి. ఇంతకన్న నుదారభావ మేదియైనం గలదా? ఇట్టి వదాన్యుడవు. నీవు సంతసించుట కంటె కామ్య మేమియున్నది? అయినను గోరుమంటివి కావున జెప్పుచుంటిని. నీవా ఘటదత్తుడను చోరువిషయమై చేయుచున్న ప్రయత్నము మరలింపవలయు నిదియే నా కోరిక. ఊరక సేనలం వాని పరము చేయుచున్నావు. వాడు నీకు వశమగువాడు కాడు. నీ హితము కోరియే యీ కోరిక కోరితినని మిక్కిలి చాతుర్యముగా బలికిన విని‌ యా రాజు తెల తెల్ల బోవుచు నిట్లనియె.

ఓహో ! నీ కోరిక కడు చిత్రముగా నున్నది. ఆ ఘటదత్తుని నెరుగుదువా యేమి? వాడు చేసినపని సామాన్యమా? నా పాలనములోని యొకయాడుదాని సర్వస్వమును మ్రుచ్చిలించిన ముచ్చును శిక్షింపక యుపేక్షింప బాడియా? వాని నిమిత్తమే నా దండయాత్ర. వాని యందిట్టిదయ కలుగుటకు వానితో నీకుగల సంబంధ మెట్టిదో చెప్పుమని యడిగిన దేవా ! నాకు వానియందేమియు దయలేదు. మీసేన లన్నియు వ్యర్దముగా నాశన మగుచున్నవని చెప్పితిని. వానిని మీరు బట్టుకొనలేరు. మీరు వెనుకకు మరలుటయే శ్రేయమని నొక్కి వక్కాణించెను.

కాదు కాదు నీకేదియో విహీతము గలదు. నీవు వాని నెరింగి యుందువు. లేకున్న నీ కోరిక మాని మరియొక కోరిక కోరుము. దీనివలన నీకేమి లాభమని యడిగిన నితండు దేవా ! నేను పదిసారులు చెప్పినను గ్రహింప లేకున్నారు. నాకేదియు గోరిక లేదు. మీకు మంచి యగుటయే నా కోరిక. అని పలుకుచు నావరనాధు ననేక ప్రకారముల వేసి నిదివరకు తానే ఘటదత్తుడనని తెలియజేసెను.

అ మాట విని యారాజు మరియు నబ్బురముఁ జెందుచు ఏమీ? నీవు ఘటదత్తుఁడవా ? అట్లయిన నిట్టి పాండిత్యము నిట్టి పరాక్రమము గలిగియా వారకాంత ధన మంతయు‌ నేమిటికిఁ దోచుకొనిపోయితివి. ప్రాజ్ఞుండవయ్యుఁ బాపకృత్యములు చేయవచ్చునా? యని యడిగిన నతం డేమియు నుత్తరముఁ జెప్పలేదు. అప్పుడు సుముఖుండు దేవా? ఈతని చరిత్రము కడు విచిత్రమైనది వినుండు. పరస్త్రీపర ------------ దిట్టి విరక్తుఁ డెందున లేడు. వీనికిట్టి యపఖ్యాతి కలుగుటకుఁ బూర్వ పుణ్యఫలము. అని యతని వృత్తాంత మంతయుం జెప్పిన విని యాభూభర్త ----------------- వెరగందుచు నిట్లనియె.

మాహాత్మా ! నీ వృత్తాంతముఁ దెలియక నిన్ను ఖేదపెట్టిన నా తప్పు