Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

ఆ మాట విని యాస్థాన పండితులు అయ్యా ! తమ కాపురమెందని యడిగిన ఘటదత్తుడు కాశీపురమని యుత్తరముఁ జెప్పెను. మీరు వారికి మధ్యస్తులై యుండఁగలరా ? ఏమి విద్యలం జదివితిరని యడుగుటయు నేదో కొంచెము పాండిత్యము కలిగియున్నది. అవసరమైన నప్పని కంగీకరింతునని చెప్పెను.

వారు వోయి రాజుగారితో నా మాటలు చెప్పిరి. అతండప్పుడే యా పండితుని దీసికొని రమ్మని దూతలం బంపెను. పండిత వేషములు వైచికొని యా యిరువురు రాజునొద్ద కరిగిరి. వారి రూపములు దేజములు చూచి కీ‌ర్తిసేనుఁడు మిక్కిలి వెరగుఁబడుచు మీలోఁ బెద్ద పండితుఁడెవ్వడని యడిగిన వారేమియు నుత్తరము జెప్పక యూరకొనిరి.

మీకు మాటలు రావా యేమి? మా పండితులు మిమ్ము గురించి పెద్దగా స్తుతి జేసిరి. మీలో మధ్యవర్తిగానుందునన్న పండితుడెవ్వడు ? చెప్పుడని యడిగిన ఘటదత్తుడు నేను నేను అని యుత్తరము జెప్పుచు అయ్యా ! తమరిందాక నిట్ల డిగిన సమాధానము జెప్పియే యుందుము. మాటలురాక మానివేయ లేదు. మీ ప్రశ్న సమంజసముగా లేదు అని యూరకొంటిమి. మా యిరువురిలో నేను గొప్ప వాడనని చెప్పుకొనినచో రెండవవాని కవమానము కలుగును. ఆత్మస్తుతి దోషము పట్టును. అని యుక్తియుక్తముగా నుపన్యసించి యా వాక్యమునకు నూరు దోషములు పట్టినవని తెలియజేసెను. అతని యుపన్యాసము విని రాజు సంతోషాశ్చర్యములతో దమ పండితుల నామాటల బూర్వపక్షము జేయుడని నియోగించెను. వారు దమకు దోచిన యుక్తులచే బూర్వపక్షము జేసిరి. వాని నూరు విధముల ఖండించి తన వాదమును స్థిరపరచుచు దనకు బదునాలుగు విద్యలలోగల పాండిత్యము దెలియ జేసెను. అప్పుడా యాస్థాన పండితులు మెడకు వస్త్రములు చుట్టుకొని యతని పాదములం బడి మహాత్మా ! నీవు సరస్వతి యపరావతారమవు. మేముకాదు. భూలోకములోనేపండితుడును నీతో బ్రసంగింపలేడు. వ్యాసుడో శంకరుడో నీతో వాదింప దగిన వారని స్తుతించిరి.

కీర్తిసేనుడు తత్ప్రసంగమును వారి మాటలను విని నివ్వెర జెందుచునప్పుడా యగ్రహారములోనున్న పండిత వేదండసింహుని సూరిభైరవుని రప్పించి కవికంఠకౌక్షేయకునితో బ్రసంగించుమని యానతిచ్చెను. అప్పుడా విద్వత్ప్రవరు లిరువురు ప్రత్యేకము ప్రత్యేకము కవికంఠకౌక్షేయకునితో బ్రసంగించిరి. వారి కొక్కొక్క విద్యయందే పాండిత్యము కలిగియున్నది. ఘటదత్తునకు బదునాలుగు విద్యలయందు నసమానమైన ప్రజ్ఞ కలిగియున్నది అట్టివానితో వారెంతసేపు వాదము సేయగలరు. నాలుగైదు ప్రశ్నలడిగియే మాచేత గాదనిపించి పాదాక్రాంతుల గావించెను.

ఆ ప్రసంగమంతయు శ్రద్దతో విని కీర్తిసేను డపరిమిత కౌతుకము జెందుచు ఘటదత్తుం గౌగలించుకొని ఆహా! నేను మిక్కి లి పుణ్యము జేసికొనుటచే నేడు