కవి కంఠకౌక్షేయుకుని కథ
261
ఎవ్వరి పని చక్కఁబెట్టి వచ్చెదము? ఒక వేళ మన సరోజిని తల్లియొద్ద కరిగిన దేమో? అదియుం జూడవచ్చును. తొలుతఁ గీర్తిసేనుని యభిలాషయే తీర్చి వత్తుమని పలుకుచు నా నగరమున కభిముఖముగాఁ గొన్ని పయనములు సాగించెను.
ఒకనాఁడొక యగ్రహారములో బసఁజేసి బ్రాహ్మణులమని చెప్పి యొక విప్రగృహంబున భుజింపుచుండిరి. వారింటికి నాఁడు మరికొందరు బ్రాహ్మణులు వచ్చిరి. తరుచు భోజన సమయమున బ్రాహ్మణులు త్రిలోక వృత్తాంతములు ప్రసంగింతురను వాడుక యున్నది. సుముఖుండాగేస్తుతో అయ్యా ! భూసురులు మీకెట్టి బంధువులు. వీరి కాపుర మెచ్చట యని ప్రస్తావముగా నడుగుటయు నతం డిట్లనియె.
వీరి కాపురము కాళిందీపురము. తత్పురాధీశ్వరుని యాస్థాన పండితులు. కీర్తిసేనుఁడను పేరుగల యా రాజు కృష్ణదేవరాయలువోలె బండితులనినఁ జెవి కోసుకొనును. సంతతము పండిత గోప్టిఁ జేయుచుండును. అమ్మహారాజు దండయాత్ర వెడలియుఁ బండితుల వెంటఁబెట్టుకొని తిరుగుచున్నాఁడు. ఈ యగ్రహారమునఁ బండిత వేదండకంఠీరవుండనియు సూరిభైరవుం డనియు బిరుదములుగల యిరువురు విద్వాంసులు గలరు. వారికిని వారి యాస్థాన పండితులకును రేపిందుఁ బ్రసంగము జరుగును. గెలిచిన వారికి గొప్ప పారితోషిక మిత్తునని రాజుగారు చెప్పుచున్నారు. వీరి ప్రసంగమునకు మాధ్యస్థుఁ డెవ్వఁడును దగినవాడు దొరకలేదు. రాజుగారే యుందురని చెప్పుచున్నారు. అని యా కథ యంతయుఁ జెప్పుటయు సుఖుముం డిట్లనియె.
అయ్యో ? అమ్మహారాజు దండయాత్ర వెడలెనని చెప్పితిరి. ఎవ్వరి మీదికో తెలియలేదు. వినిపింతురే యని యడిగిన నయ్యజమానుండాస్థాన పండితుల నడిగెను. వారు ఘటదత్తుఁడను దొంగ మా పురమువచ్చి వేశ్యామందిరములోఁ బ్రవేశించి విత్తమంతయుఁ దస్కంరించెను. వానిం బట్టికొనుటకుఁ బెక్కు సేనలం బంపెను. ఆ వీరుఁడు వారినందరను గాందిశీకులఁ గావించెను. మొన్నను పదివేల మందిని యొక్కరుఁడు పారఁదోలెనట. అ వార్తవిని మా భూభర్త స్వయముగా వానిం బట్టుకొనుటకు బయలుదేరెను. అని యా వృత్తాంతమును జెప్పిరి.
ఆ యింటి యజమానుఁడు అవును. ఘటదత్తుని పేరు వాడుకగానే వినుచున్నారము. వానికొఱకుఁ బెక్కండ్రు తిరుగుచున్నారని యుత్తరము జెప్పెను. రాజుగా రొక్కనికై యింత ప్రయత్నము చేయుట యాశ్చర్యమే. పండిత ప్రియుం డయ్యు దీర్ఘ క్రోధుండగుట కూడదని సుముఖుడు పలికెను. ఈ రీతి భుజించినంత కొంతసేపు నా కథయే చెప్పుకొనుచుండిరి. భోజనానంతరమున సుముఖుండు మద్యవర్తి గావలసినచో నీతండు తగినవాఁడే. ఈయన పేరు కవికంఠ కౌక్షేయుకుఁడు మీ యంగీకరింతురోఁ జెప్పుడని యుపదేశించెను.