Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

మంజరి కథ

255

రేమి ? అతం డిప్పు డెందుండెను. అని యడిగిన నమ్మహారా జొక్కింత తడవేమియు మాటాడక‌ నిట్టూర్పులు నిగుడించుచు నామె మొగంబుఁ జూచుచు నిట్టనియె.

కళావతీ ! నా హృదయంబున రవులుచున్న కోపాగ్ని నేల ప్రజ్వరిల్లఁ జీసెదవు ? వాఁడేమయ్యెనో నాకుఁ దెలియదు. ఊరు కొనుమని పలికిన వదలక నమ్మదవతి యనునయించుచు నత్యంతశాంత స్వభావులైన మీ హృదయంబునఁ గోపజ్వలనం బుదయించుటకుఁ గారణము తెలియకున్నది శీతకరుం డెన్నడైన వేడిఁ గలిగించునా ? అక్కధ యెరింగింపక విడుచుదానను గాను దిట్టినం దిట్టుదురుగాక యని యతని మనసు గరుఁగునట్లు ప్రార్దించిన నొక్కింత శాంతుండై యిట్లనియె.

పల్లవాధరలు చల్లని మాటలాడుచు వల్లభునియుల్లము లాగికొని మోసపుత్తురు. అట్టివారిని నమ్మిన మగవారిం బట్టుకొని జుట్టుకోయవలయును! వినుము కౌముది కడు నిల్లాలని నమ్మి నేను మోసపోయితిని. ఘటదత్తుండు కృతఘ్నుండని యెఱుఁగక నాఁడు మీ యిరువురి యొద్దకుఁ దీసికొని పోయితినిగదా ? వానిం జూచి యే మేమో వెఱ్ఱిచేష్టలఁ బ్రకటించి యడిగినంత నిర్భయముగా నుత్తరముఁ జెప్పినది. తరువాత మనమాయూరి కరిగినప్పుడు చేసిన చర్య లీపత్రికవలనం దెలియబడఁగలవు. చూచు కొమ్మని యా చీటి యాబోటి కందించెను.

ఆ కనకగాత్రి యా పత్రికం జదివిగొని‌ కనురెప్ప లస్వశించుచు నొక్కింత తడవు ధ్యానించి మనోహరా ? మీరు విద్వాంసులయ్యుఁ గృతాకృతముల వితర్కింప కున్నారు గదా ? కౌముది కడునుత్తమురాలు. ఏకళంకము నెరుఁగదని నేను శపధముఁ జేయఁ గలను. మీ యెదుట నామె నుడివిన మాటలం బట్టి యనుమానించు చున్నారు. ఆ సతీమణి వీసమైన దోసము చేసినదియేని నిర్భయముగా నట్లు మీతో వాదింపదు. అంతఃపురపరిచారిక లెవ్వరో యిట్టి ప్రధను బుట్టించినారు. ఒరుల కీ పత్రిక వ్రాసి మీ తల్బంబున నిడుట శక్యమా ? వ్రాతరీతిం బరిశీలించి వారింబట్టు కొనియెదఁ జూడుఁడు. వెనుక భోజరాజు భార్య విషయమై శంకించు కొని కాళిదాసుం బొమ్మని నిక్క‌ మెరింగిన పిమ్మట నెట్లు పశ్చాత్తాపము జెందెనో యెరుంగరా : ఘటదత్తుని పైనట్లే యనుమానపడి మీ రూరక నలఁగుచున్నారు. ఆతం డుత్తమకుల సంజాతుండు సుగుణ విధానమగుట ద్రోహకృత్యములకుఁ దొరకొనఁడు. లెస్సగా విమర్శించి దోషారోపణము జేయవలయునని యా సాధ్వీమణి ఘటదత్తుని జన్మ వృత్తాంతముతో ననేక దృష్టాంతములు చెప్పి యా వసుంధరుని మనసు పశ్చాత్తాపముఁ జెందునట్లు గావించెను.

అప్పు డతండెడద జాలివొడమ పడతీ ! తొందరపడి ఘటదత్తునిఁ దూలనాడితినిగదా ? ఆతం డేపాపము నెరుఁగనిచో నా మాటలకు నెంత దల్లడిల్లునో? అయ్యో? ని న “పాప .ఏటు లీగికొందుగు. క్రుద్దుండు గరువైనఁ జంపునసు

- కటకటా ! నోటికిరాని దుర్భాషల నాడినంత మే నెల్ల నీరై పోవ