(32)
ఇంద్రదత్త కథ
249
కృత్యము లేమిటి కబ్బినవి. ఈ కథ మా రాజపుత్రికకుఁ దెలిసి మిక్కిలి పరితపించుచున్నది. అని యక్కడ జరిగిన తెరంగంతయుం జెప్పెను.
అప్పు డా చిన్నది చేయి పట్టుకొని దూరముగాఁ దీసికొనిపోయి నెచ్చెలీ ! నీ వడిగితివి కావున నిజముఁ జెప్పుచుంటి వినుము. ఘటదత్తుఁ డుత్తమకుల సంజాతుఁడు. సకలశాస్త్రములుం జదివినవాఁడు వసుంధరుఁడను రాజు వానికి మంత్రిపద మిచ్చి యేమిటికో కోపముఁ జేయుటయు నతం డూరు విడిచి యడవికిం బోయెను. అందు దొంగలసహవాసముఁ జేయవలసి వచ్చినది. తన కిష్టము లేకున్నను వారితోఁ దిరుగుచు మా తల్లి - అనఁబోయి - కాళిందీపురంబున జంద్రవతి యింటిలో దూరిన మాట నిజమె. ఆ మ్రుచ్చిలి కతఁ డేమియు బూనికొనినవాఁడు కాడు. నన్నుఁ బట్టికొని అన బోయి -- దాని కూఁతుం బట్టికొని దొంగలు బాధింపుచుండ విడిపించెను. అని యతని కధ యంతయు నా మూలచూడముగాఁ జెప్పి యిందాతని తప్పేమి యున్నదో చెప్పమనియడిగెను.
మురళి విస్మయముఁ జెందుచు అయ్యో ? నిష్కారణము నతఁడపనింద మోయుచున్నాఁడు. ఇంద్రదత్త యావాడుక విని మిక్కిలి దుఃఖించుచున్నది. నీవు అనఁబోయి ఆ సరోజినియే యీ కపటముఁ జేసినదని కుందుచున్నది. పాప మతండే పాపము నెరుఁగనిదే యింత దుర్యశము కలిగిన దేమి ? కాళిందీపురము బోయి యా మాట జెప్పరాదా ? సరోజిని యేమైనది? నిజముఁ జెప్పుము. నా యొద్ద దాచనేలయని పలికిన నత్తన్వి యిట్లనియె.
ఇందుముఖీ ? నీవు నాకు సఖురాలవైతివి. ఇఁక నీ యొద్ద నిజముదాతునా? ఆసరోజిని నేనే వినుము. మీ వీటినుండి మే మిరువురము బయలుదేరి యొకదారి బడి పోవుచు నొకనాఁడు మిట్టమధ్యాహ్నమొక మర్రిచెట్టు క్రిందఁ బండుకొంటిమి. రాజభటులు మా నిమిత్తమై యడవులలోఁ గూడ వెదకుచుండిరి. కావున నా వటవృక్షము కొమ్మలపై నుండి మా మాటలు విని యురికి ఘటదత్తుఁ బట్టికొనిరి. నిరాయుధుండైనను నతండు ముప్పదిమందిం గడతేర్చెను. చేత నాయుధ ముండిన మరి
వచ్చినను వాని నేమియుం. జేయఁజాలరు. పదుగురతో నొకఁడు పోరుట దుర్ఘటము కాదా ? వారికిఁ బెద్దతడవునకుఁ బట్టువడియెను. సంకెళులు వైచి దీసికొని పోయిరి.
నేనా సందడిలో వారికిఁ గనంబడక తప్పించుకొని మారురూపున వెనువెంటఁ బోవుచు నొక గ్రామమున నొక విహితునివలన నతండు విడిపింపఁబడుట కన్నులారఁ జూచితిని. కాని వానిం గలిసికొనలేక పోయితిని. నే నం దున్నట్లతం డెరుఁగడు. ----------- బరిభవించి యతండా మిత్రునితో నెక్కడికో పోయెను. అతని నిమిత్తమే దెలిసికొని నే నిక్కడినుండి బయలుదేరి వానినే వెదకికొనుచు మొన్న నే నిచ్చటకువచ్చితిని. ఇక్కుప్పము నాలుగుదేశముల త్రోవలో నుండుటచే నతం