248
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
గదా? నేను వేరొకనిం బెండ్లి యాడను. వానిమెడలో భర్తయని తలఁచి పూవుదండ వైచితిని ఇప్పుడు కాదనిన దప్పునా ? నా ప్రారబ్దము నాది నాలిఖితమునకు మీ రేమి చేయుదురు. ఇంద్రుని కొడుకో, కుబేరుని కొమరుఁడో వచ్చి పెండ్లి యాడునని యాసతో నున్నందులకు మంచిమగఁడే లభించెనని తలంచుచు వెక్కి వెక్కి యేడువఁ దొడంగినది
పుత్రికం గౌగలించుకొని శర్వాణియు తల్లీ ! వగవకుము. వెర్రి పని చేసితివి. నాతో నింత చేప్పరాదా ? ఆ మాయలమారి యెవ్వతెయో నిన్ను మోసముఁ జేసినది. నా మాట వినుము. సావిత్రి యరుంధతి వారి పోలికలు మన కేమిటికి ? మన కథలు మనవి. నిశ్చిత వివాహవిపర్యాసము లెన్ని జరుగుచున్నవి. వానిలో నిది యొకటి. మంచి సంబంధమును గురించి వెదకించెచ నూరడిల్లుమని బోధించిన నా చంచలాక్షి తల్లి నాక్షేపించుచు నప్పని కొడ బడినది కాదు. అప్పుడు తల్లి యేమియుంబలుక నేరక యవ్వలికి బోయి మనోహరుని కవ్విధం బెరింగింప దరినరయు చుండెను.
ఇంద్రదత్తయు మురళిం జీరి ప్రియసఖీ ! నీ కంటె నా కాప్తులు లేరు. నాఁడు నీవు దాపున లేక పోపుటచే నిట్టి ప్రమాదము జరిగినది. అతండు దొంగల రాయఁడని చెప్పుచున్నారు కాని నా కంత నమ్మకము లేదు. ఎట్లయినను సరియే నీవు వోయి వారిని వెదకి తీసికొని రావలయును. అని బ్రతిమాలుటయు నా మురళి వారిగురుతు లన్నియుం దెలిసికొని నాడే బయలుదేరి ప్రతి గ్రామమునకుం బోవుచు వారి పేరులు సెప్పి వెదకుచుండెను. ఒక పల్లెటూరిలో నొక యింటి యొద్దఁ గూర్చుండి కథలఁ జెప్పుచున్న యొక చిన్న దానిం జూచి తన్వీ ! సరోజిని యను చిన్నదియు ఘటదత్తుఁడను చిన్నవాఁడు నీయూరు రాలేదు గద. అని వారిగురుతులం జెప్పి యడుగుటయు నా కథకురాలు వారియవసరము నీ కేమిటికి వచ్చినది ? నీ దేయూరు? నీ పేరేమియని యడిగిన మురళి యిట్లనియె.
బీటీ ! మాది కమలాపురము. నా పేరు మురళి యండ్రు. ఇంద్రదత్త యను రాజపుత్రిపంపునఁ దిరుగుచుంటిని. వారు మాకు మిత్రులగుట వెదకుచుంటినని చెప్పినది. వారిజాడ నాకుఁ గొంచెము తెలియును. చెప్పెద నిటు రమ్ము అని చీరి యేకాంతముగా నాకాంత యింద్రదత్త యెందు నిమిత్తమై వారిని వెదకమన్నదని యడుగుటయు మఱేమిటికింగాదు వారి మేలుకొరకే యని చెప్పినది.
అట్లయిన వినుము. ఘటదత్తుఁడు శత్రువులచేఁ జిక్కులు పెట్టబడు చుండెను. అతనినిమిత్తమే నేను దిరుగుచున్నాను. నీవు నాతో రమ్ము. ------------ మెరింగింతు నని యామె చెప్పుటయు నప్పడఁతి యతండు మ్రుచ్చులకు మొనగాఁడని సత్యమే ? వెలయాలి యిల్లుఁ గొల్లఁబెట్టెనట కాదా ? దానికూతురు సరోజిని. దాని వెంటఁ బెట్టుకొని తిరుగుచున్నాడని వింటిమి. అట్టి యుత్తమున కీ నీచ