250
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
డేదారినైన నిటకరుదెంచునేమోయను నాసతోఁ దెఱవు మొగముననున్న యా విప్ర గృహంబున వసియించి వారికి వినోదార్దము కథలఁ జెప్పుచుంటి. దైవవశంబున నిన్నుఁ గలసికొంటి. నే నీరహస్య మిదివర కెవ్వరికిం జెప్పి యుండలేదు. వేయు నేల ఘటదత్తుఁడు భూలోక మంతయు నేలదగిన బలశాలి. ధర్మరాజుకన్న నెక్కుడు గుణవంతఁడు. అతని కింకను మంచిదినములు రాలేదని యావృత్తాంతమంతయుఁ జెప్పినది. మురళియు సరోజినీ ఘటదత్తుఁడు ఇంద్రదత్తపై యనురాగము గలవాఁడగుట నక్కడికే రాఁగలడు మన మానగరికిఁ బోవుదము రమ్ము. ఇంద్రదత్త సత్యమైన మీ చరిత్రవిని హృదయపరితాపము విడువఁ గలదని పలికి యక్కలికి తోఁగూడఁ గొన్ని పయనంబుల కావీడు చేరినది అని యెరింగించి మణిసిద్ధుఁ డవ్వలికథ మరియు నిట్లవ్వలి మజిలీయందుఁ జెప్పదొడంగెను.
ఎనుబది తొమ్మిదవ మజిలీ
మంజరి కథ
పాటలిక - ఓసీ ? మంజరికా ! ఇప్పుడు మహారాజు కౌముదియం దేమిటికో యలిగి యామె యంతఃపురమునకుఁ బోవుట లేదట. అందుల కామె పరితపించుచు మీ రెద్దియో కొండెములు సెప్పి మానిపించిరని తలంచుచు నా కారణము గ్రహించి రమ్మని నన్నుఁ నియమించినది. మనలో మన కంతరము లేదు కదా ? నిజ మెరింగినని జెప్పెదవా ?
మంజరిక - అత్తా ! నీతోఁ జెప్పకుందునా? నాఁడు మన మొుండొరులము చెప్పుకొన రహస్యములకన్న నివి గూఢములా యేమి? కౌముది తల్లి నీ కా బహుమానముఁ జేసినదా ?
పాట - లేదు. లేదు. తనపుత్రిక శిశువుఁగూడ గతతేరినది కాదా? అందులకు హెచ్చరిక లేక జరుపుచున్నది.
మంజ - కౌముదికిఁ బుట్టినది ఆడుబిడ్డయా ? దాని నెట్లు మార్చితివి ?
పాట - నీవు చెప్పినట్లే చేసితిని. ప్రసవసమయమున దాపున నేనును నా పుత్రికయు మాత్రమే యుంటిమి. తల్లి దూరముగానున్నది. పిల్ల భూమిపైబడిన తోడనే తెచ్చియుంచిన మృతయంత్రశిశువు నందుంచి యా బాలిక నేడువకుండఁ బట్టికొని నా కూఁతురు నొడిలోఁ బడవైచి యవ్వలికిఁ దీసికొని పొమ్మని పంపితిని.
మంజ - కౌముది చూడలేదుగదా ?
పాట - ప్రసవవేదనా వివశయై యామె యొడలే యెరుంగక కున్నదిగదా?
మంజ - తరువాత.
పాట - చచ్చియే పుట్టినదని యా పిల్లం జూపితిని. అంతగా విమర్శింపక