ఇంద్రదత్త కథ
245
నిరపరాధుల మమ్ముఁ బట్టికొనఁబూనిరని పలుకుచు నెదురుకొనుటయు రాజభటు లిట్లనిరి.
తులువా ? నీవు రాజువలెవచ్చి బోగముదాని మచ్చ మాపుటయె కాక కూతుంగూడ నెత్తికొని - పోయితివి నీ నిమిత్తమై పుడమి యెల్లడం గాలించుచున్నారము. మా యెకిమీడు నిన్నుఁ బట్టికొని తీసికొని వచ్చినవానికి మూడుగ్రామములు కట్టన మిత్తునని ప్రకటించియన్నాఁడు నీవు మా బారిఁ బడితివి. పోనీయమని పలుకుచు నందరు నొక్కట వచ్చి యతనిం జుట్టుకొనిరి.
నిరాయుధుండైనను హస్తపదతాడనంబుల నవ్వీరుండు వారిలో ముప్పది గుండ్రజముప్రోలి కనిపెను మిగిలినవారు పౌరుషము మీరఁ గలియఁబడి యెట్టకే నతనిం బట్టికొని కరపాదంబులకు నిగళంబులు తగిలించి సరోజినిజాడ యేమియుం దెలిసికొనఁజాలక నతనితోఁ గూడ గాళిందీపురాభిముఖులై యరుగుచుండిరి.
అని యెరిగించువరకుఁ బ్రయాణసమయ మగుటయు జాలించి తదనంతర వృత్తాంత మా తపోధనుం డవ్వలిమజిలీయం దిట్లు చెప్పుచుండెను.
ఎనుబది ఎనమిదవ మజిలీ
ఇంద్రదత్త - సఖీ ! మురళీ ! సురకుమారులపై నా మనసు మరలినది నేనొక సుందరపురుషుని వరంచితిని. నీకు జెప్పకున్న గోపింతువు గదా ?
ముర - ఎట్టెట్టూ ? నీవు వరింపదగిన పుణ్యశాలి యెందుండి వచ్చెను. అతని పేరేమి ? ఎప్పుడు వరించితివి ? మాకు రవ్వంతయు దెలిసినది కాదే? ఆతం డిపు డెం దున్నవాఁడు ?
ఇంద్ర - సరోజినియను లేఖకురాలీ సంబంధము మొన్న నే పొసగించినది. వానిపేరు ఘటదత్తుఁడు. ఇప్పుడీవీటనే యున్నాఁడు.
ముర - నెలవెరింగింతువేనిఁ బోయిచూచి యానందింతుముగా ?
ఇంద్ర - వానియునికి నాకుఁ దెలియదు. సరోజిని సుమతియను వర్తకునిసత్రములో బసచేసి యున్నది. దానిం గలసికొనిన నంతయుం జెప్పఁగలదు.
ముర - అతం డేదేశపు రాజకుమారుండో యడుగలేదా ? అట్టి యుదారండు మనవీటిలో బసఁజేసిన వెల్లడి కాకుండునా ? వానిరూప మెట్లున్నది ?
ఇంద్ర - వాని చిత్రపట మిదిగో చూడుము. నీకునుం దెలియఁగలదు.
ముర - (నాశ్చర్యముగాఁజాచుచు) నిక్క ముగా నిట్లున్నవాఁడా ?
ఇంద్ర - ఇంతకన్న నొకవన్నెవాసిగానే యున్నవాఁడు? సందియమున్నఁ బోయి చూచి రమ్ము.
ముర - ఈ శుభవార్త నమ్మగా రెరుఁగుదురా ?