238
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
సరోజిని - అమ్మా ! నీవు దేవతలు మనుష్యులకన్న జక్కనివారని పురాణవాఖ్యములు విని భ్రమపడుచున్నావు. అది వట్టిమాట సుమీ ?
ఇంద్రదత్త - ఓహో ! నీ వ్యవాహారంబులు కళాబాహుళ్య వేతృత్వంబు సూచింపుచున్నవి. ఏ మైనం జదివితివా ?
సరో - ఏమియు జదువక లేఖవిద్యలో నాయంతవారు లేరని గర్వపడు చందునా ?
ఇంద్ర --- ఏమి చదివితివి ?
సరో - పదునాలుగువిద్యలు కొంచెము కొంచెము తడవి చూచితిని.
ఇంద్ర -- అందులకా ? మనుష్యులకన్న దేవతలు రూపహీనులని చెప్పు చుంటివి ?
సరో -- సందియమేలా ? తారుణ్యహీనులే ? పీనుగుల కన్నులవలె ఱెప్పపాటులేక తెఱచికొని చూచుచు బొల్లి తెవులనం బోలె నొడలెల్ల తెల్లఁబడియుండ నిద్రాహారములు లేక యేకరీతినున్న వేల్పులు చూచు వారికి వెరపుఁ గలుగఁజేయక మానరు. మన పెద్దలు వారిపైగల గౌరవమునం బట్టి వికృతరూపులైనను బురాణాదుల సుందరులని వర్ణించి యుండిరి. అంతియకని వారియం దట్టి సౌందర్యము లేదు. ఇంతయేల ? మరియొక నిదర్శనముఁ జెప్పెద వినుము. దేవకన్యకలు సుందరులైన మన రాజపుత్రులం జూచి రేని స్వర్గమున వసింతురా ? అర్జునుఁ నొకసారి జూచినంతనే యూర్వశి వావి కాకున్నను మోహించిన దనమాట నీవు వినియే యుందువు. మరియు నత్తరుణి పురూరవునితోఁ బెద్దకాలము పుడమిఁగాపురము సేయలేదా ? తిలోత్తమ శుచికుఁడను సుందరుని వరించిన కథ నీవు వినకపోవచ్చును. గంథర్వరాజపుత్రి యగు మహాశ్వేతయుఁగాదంబరియు దేవతలలోఁ జక్కనివారే యైయుండినచోఁ బుండరీకుని కొరకును జంద్రాపీడును కొరకును నన్ని బాము లేలఁ బడియెదరు. అశ్వముఖులగు కిన్నరలయందము గురించి విస్తరించి చెప్పనక్కరలేదు. మరియుఁ ద్రిలోకాధిపతియగు మహేంద్రునికన్న నధికుండు లేడని నీ వొప్పు కొనక తీరదుగదా ? దేవకన్యక లందరు నతనికి వశవర్తినులై యుందురనుట యతశయోక్తికాదు. అట్టి యింద్రుం డహల్యనిమిత్తము గౌతము పంచ కోడియై వేయిగన్నులుం దెచ్చికొనిన గాథ నీవు నమ్మితివేని యిట్టి వెఱ్ఱిబూనకుందువు. తమ భార్యల కన్నఁ జక్కనిది కానిచో దమయంతిం బెండ్లియాడు తలంపుతో దిక్పతి ప్రముఖులు నలుగురు బుడమి కేమిటికి వత్తురు ? దమయంతి యింద్రాది దిక్పతుల విడచి నలుని వరించినకథ దేవతలకన్న మనుష్యులే సుందరులని వేనోళ్ళజాటి చెప్పుచుండలేదా ? రాజపుత్రీ , నీ వోపికతో వింటివేని నిట్టి నిదర్శనములు వేనవేలు సూపఁగలను.
ఇంద్ర - (విస్మయముతో) ఓహో ? నీ యుపన్యాస మప్రతిహతమై