సుముఖుని కథ
235
పూవు - గడుసుప్రశ్నమే వేసితివి. వినుము. చెల్లెలని చెప్పినంగాని సుముఖుడు పెండ్లి యాడుట కనుమతింపడు. యౌవరాజ్యపట్టాభిషిక్తుండైన సుముఖుని వల్ల భునిఁ జేయుటకంటె నాధిక్య మే మున్నది ? అగ్గణికయే పట్టమహిషి యైనచోఁ దరువాత ఘటదత్తునకుం దగిన యుపకారము సేయకపోవునా ? ఇవి యన్నియు నాలోచించుకొనియే వా రట్టి వూహ్యముఁ బన్నిరి.
చకో - అదిగో ? అమ్మగారు విచారముఖముతో నిట్లే వచ్చుచున్నది. మనము పోవుదము లెమ్ము అని యిరువురు నిష్క్రమించుచున్నారు.
ఘటదత్తుడును సరోజినియు సుమేధునిచే నట్లు రాజభటులవలనఁ బట్టుబడ కుండ గాపాడఁబడి యేకాంతముగా నవ్వీఁడు వెడలి యెందేనిం బోవుచుండిరి. నడుచునప్పుడు ఘటదత్తుఁడు చెల్లెలా ? నీకు ననుకూలవరుండు లభించెనని మిగుల నానందించితిని. నీ పెండ్లి అయినచో నీ బరువు నాపైఁ దొలఁగిపోవును. దైవమంతరాయముఁ గలిగించెను. విద్వత్ప్రముఖుఁడగు నా సుముఖుఁడు మనకు నా సుముఖుఁడైనను భాగధేయము విముఖ మైనది. నీవు వేశ్యాపుత్రిక యనిన పిమ్మట నిన్ను భోగినీకళత్రముగా సుముఖుఁ డంగీకరించునని సుమేధుఁడు నాతోఁ జెప్పెను కాని నే నందుల కొప్పుకొనలేదు. పోనిమ్ము. మరియొక తెఱవాలోచించు కొందమనుటయు నా కుటిలకుంతల తల యించుక వంచుచు అన్నా ! నన్ను గురించి నీవును నంగదఁ గుడుచుచుంటివి. నా దురదృష్టదేవత నా నెత్తిపై నాట్యమాడుచుండ నీ వేమి చేయఁ గలవు ? పోనిమ్ము. నీ వెందైన నుద్యోగము సంపాదించి చక్కని కన్యకం బెండ్లి యాడుము. మీ కడ వరవుడనై దేహయాత్ర నడిపికొనియెదనని పలికినది.
తల్లీ ! నీ కంతకర్మమేల వచ్చినది ? నీ విద్యకును నీ బుద్ధికిని నీ రూపమునకుం దగినవరుం బెండ్లిచేసి తీరెదను. నీ వుత్తమరాజ్యపట్టభద్రునకు మహిషివి కాఁదగిన లక్షణంబులు నీ యందుఁ బొడగట్టుచున్నవి. నీవు చింతింపవలదని యూరడించెను. అట్లు వారు కొన్ని పయనంబులు నడచి యొకనాఁడు సాయంకాలమునకుఁ గమలయను పట్టణంబునకుం బోయిరి. వారు మొగంబుల కేదియో భస్మ మలందుకొనిరి. దానంజేసి వారి సౌందర్యవిశేషంబు లంతగాఁ దెల్లము కాకున్నవి. ఎఱిగిన వారైన వారింగురుతుపట్టఁ జాలరు. వా రప్పురంబున సుమతియను వర్తకుని యింట బసఁ జేసిరి. ఆ సుమతి యాత్రాపరులకు నెలవులిచ్చి యన్నసదుపాయము సేయుచుండును. అతండు పదిదినములు వారి యింటఁ బెట్టుకొని పోషించెను. ఆ వర్తకుఁడు ఘటదత్తుని వికృతరూపముఁ జూచి మొదట సామాన్యుఁ డనుకొని యపేక్షగాఁ జూచెను. నాలుగుదినములు పరిచయము గలిగి సంభాషించిన తరువాత నతనివిద్యా పరిశ్రమమునకు మిక్కిలి మెచ్చుకొనుచు నతనితోనే ముచ్చటించుచుఁ గొన్నిదినము లందుండమని కోరికొనియెను.
ఘటదత్తుఁడు పగ లెల్ల నా రాజధాని నాలుగువీధులం దిరిగి వింతలంజూచి