ప్రభావతి కథ
227
మచ్చకంటి జీవితముకంటె నీచమున్నదియా ? అని ధర్మప్రతిపాదకములగు వచనంబు లుచ్చరింపుచు నా సతీరత్నము వెక్కి వెక్కి యేడువఁ దొడంగినది.
సుగుణశాలియగు నతం డామెశీల మట్టిదికాదని నిశ్చయించి సంతసముతో నక్కునం జేర్చి యోదార్చుచు ప్రేయసీ ! పెండ్లియాడకమున్న మగనిశీల మెట్టిదియో తెలియక పూర్వమే యిట్టి శపధము చేయుట నాశ్చర్యముగా నున్నది. మగడు విననివాఁడైన నేమి సేయుదువని యడిగిన నమ్ముదిత ముదితమనస్కయై దృఢవ్రత యగు మగువకు దైవ మేల తోడ్పడకుండెడిని. త్రికరణంబుల దైవముగా నెంచి పూజించెడి భార్యమాటఁ బతి యేమిటికి వినకుండెడిని. మదీయ చిత్తశుద్ధియే యిట్టి శపధముఁ జేయించినదని పలికిన నా రాజనందనుండు తనభార్య ధర్మస్వభావమునకు భావమునఁ దద్దయు మురియుచు రమణీ ! బోయిరమ్ము నీ ప్రతిజ్ఞఁ జెల్లించుకొను మని యానతిచ్చెను.
అప్పు డాసుందరియుఁ బరమసంతోషముతో ఫలహారములఁ బసిడిపళ్ళెరము నిండఁ గైకొని గూఢముగాఁ బెరటిమార్గంబున నిల్లు వెడలి గాంఢాంధకారములో ధారాధరంబులోని మెఱుఁగు తీగెయుం బోలె మెఱయుచు మెల్లన నరుగు చుండెను.
సీ. ఆపాదమస్తకం బలఁదిన మసినూనె
చాయతోఁ జీకటుల్ సరసమాడ
గనులఁబ్రామిన కాటుకల మీటికొని భీక
రారుణాక్షిద్యుతి ల్వేరుగాఁగ
నసమానవారుణీ రసపాన మత్తతా
వశమున గమనముల్ వాసిదొఱగ
గరదీపితాభీల కరవాలహేతి చ్చ
టారుక్తళత్తళల్ దారిసూప
గీ. జెట్టిలాగులపై గాళజుట్టి సుషిర
కరణసాధనముల జాల సరల జొనిపి
కడు భయంకరులైన తస్కరులు నల్వు
రెదురపడి రవ్వధూమణి యదరిపడగ.
సకలాభరణ భూషితయై వచ్చుచున్న యాచిన్నదానిం గాంచి యమ్ముచ్చులు ముఱియుచు దెరపున కడ్డముగా నిలిచి తెఱవా ? యెందేగెదు నిలునిలు. నీ యొడలి తొడపు లిం దిడుమని యదలించుటయు నదరపడి యయ్యబల కనులు మూసికొని కొండొకవడికి యుదుటఁబూని అన్నలారా ! గురుకార్యార్దినై యరుగుచుంటి. నా యొడలి తొడవులన్నియు మీ వియే? నా కెర వీయుడు. రెండుగడి