Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

యలలో వచ్చి మీ నగలు మీ కిచ్చు దాననని పలికిన బకాపక నవ్వుచు నాతస్కరు లిట్లనిరి.

చ. గురుపనిదీర్చి వేగనిదిగో ? చనుదెంచదనంచు బల్కెదీ
    వరుదుగ నీ నయోక్తు లెవరాత్మల నమ్మెదరమ్మ చెల్ల త
    స్కరులము మేము మా కడన సాగునె నీ కపటంబు లక్కటా ?
    యరమరలేక మండనము లన్నియు నిక్కడ బెట్టిపొమ్మికన్‌.

క. దొంగలకు గలుగునేదయ
   యంగనలకు డలదెసత్య మహహా ? నీమా
   యం గలుదుమేఁ మేమీ
   వుంగమలదాళాక్షి యిచ్చిపొమ్ము విభూషల్‌.

గీ. గురువుపని యీ విభూషలు కొదవయైన
   సాగదే ? యీ గదే వేగ సరసముగను
   గురువు దైవముగద వానిదరికిఁ నరుగ
   నగ లివేటికి గణికవే ? వగలుసూప.

అని యాక్షేపించుటయు నాచంచలాక్షి తనపోయెడి తెర గంతయు వారి కెరింగించినది. వాండ్రు మరియు నవ్వుచు--

క. ఇల్లాలువోలె బల్కెదు
   కల్లలు మా యెదుట వావిగాని యతనితో
   జిల్లరిపనులకు నరిగెదు
   ప్రల్ల దురాలవుగ నిన్ను బాటింతు మికన్‌.

అయ్యారే ! నీ పలుకులు కడువిపరీతము. పతివ్రతలు పరపురుషుం గూడునా ? మగని యనుమతిని గురుని గూడ నరుగుచుంటివని పల్కుచుంటివి. ఇట్టి రంకులాడి నుడుపులు సత్యములని నమ్మవచ్చునా ? నగలీయక పోనీయమని పలికిన నా కలికి వెండియు నిట్లనియె.

అన్నలారా ! నేను బంచభూతములు సాక్షిగాఁ జెప్పుచున్నాను. నా మాట నించుకయు నసత్యము లేదు. నేను గామాభిలాషతో నరుగుటలేదు. మున్నన్నమాట నిలుపుకొనుటకై పోవుచుంటిని. మీ రనుగ్రహించితిరేని కార్యసాఫల్యము కాగలదు. అలంకారశూన్య నైతినేని గురుఁడు నన్ను వేరొకరీతిఁ దలంపగలడు. అస్థిరములైన దేహసుఖములకై స్థిరసుకృతములఁ బోగొట్టికొందునా ? రక్షింపుడని యనేక ప్రకారముల మొఱ పెట్టినది.

ఆ బోటిమాటలు వినుటచే‌ గటికవాండ్రకే దయ వచ్చినది. వేగఁబోయి రమ్ము. మే మిందే యుండెదము. రాకపోయితివేని నీ పని పట్టక విడువము సుమీ ? యని పలుకుచు ముచ్చు లప్పొలతుకను విడిచిరి. అట్లు పాటచ్చరుల నిర్భం