Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

ఆహా ! నాయుదంతము తలంచికొనఁ గడు వెరగు గలుగుచున్నది. ఉత్తమ బ్రాహ్మణ కుమారుండనై విద్యలం జదవి రాజావలంబనముఁ బొందియు జివురకుఁ జోరులలోఁ గలసి విటుఁడనై దీనియింటికి వచ్చితిని. అయ్యో ? నమ్మి యిల్లి చ్చిన యిమ్మచ్చకంటి నెట్లు వంచించువాఁడనో తెలియదు. విశ్వాసఘాతుక పాతకముకన్న ఘోరమైనది వేరొకటి లేదుగదా! మరియు విటులఁజూచి వెలయాండ్రు మురియుచుందురు. ఇప్పడతి విలాసములు చూపక నేలంబండికొని దుఃఖించుచున్నట్లు కనంబడుచున్నది. ఇదియుం జోద్యముగానే గానే యున్నది. అని తలంచుచు నా జవరాలింజూచి యిట్లనియె.

తరుణీ ! నీ పేరేమి ? నీవు వారాంగనవుకావా ? గణికాధర్మములు నీ యందుఁ గనంబడవేమి ? అట్లు విచారించుచుంటివేల ? నీ వృత్తాంత మెరిగింపుమని యడిగిన నప్పఁడతి కన్నీరు దుడిచికొనుచు నమస్కరించి యిట్లనియె.

అన్నా ! నీవు నాకు సహోదరుఁడవు. నిన్నుఁ దోబుట్టువుగా జూచి మన్నించెదవని నీ మొగము జూచి నా వృత్తాంతముఁ జెప్పెదను. లేనిచో నిట్లే దుఃఖించుచుండెదనని పలికిన విని యతండు వెరగుపాటుతో సహోదరీ ! నీ వునన్నన్నాయని పిలిచినపిమ్మట నీ యందు నాకుఁ వేరొక బుద్ది యెట్లు పొడమెడిని. అదియునుంగాక నిన్ను నేఁ గామించి వచ్చిన వాఁడనుగాను. నాకు నదియొక ప్రారబ్దమే. పిమ్మట నా కథయుంజెప్పెద నీ తెరఁ గెట్టిదో నుడువు మనుటయు నప్పొలతి తల యించుక యెత్తియిట్లనియె.

అన్నా ! నాకులమేదియో నాకుఁ దెలియదు. నా తలిదండ్రు లెవ్వరో నే నెరుంగును. నా కెనిమిదేండ్ల ప్రాయము వచ్చినది మొదలు నా కథ జ్ఞాపకమున్నది. అంతకుముందొక గ్రామము నుండి యొక గ్రామమున కొకరి యొద్ద నుండి వొకరి యొద్దకుం దిరిగితిని యది యంతయు స్వప్న ప్రాయముగానున్నది. విశాల యను పట్టణములో నేనొక తంతు నాయకుని యింటిలో నాడుకొనుచుండగా నొకనాఁ డొక యాడుది వచ్చి నన్నెత్తుకొని ముద్దాడుచు బాలా నీ వెవ్వరి దానవు? నిన్ను మేము పెంచుకొనెదము వత్తవా? యని; యడిగిన నేను జడియుచు గిలగలఁ గొట్టికొంటిని. అపుడది నన్ను దింపి మీలోపలికిఁ బోయి మిక్కిలి సిరిగల వేశ్యకుఁ చక్కనిపిల్ల కావలసియున్నది. అట్టి బాలిక యిందుఁ గలదని వినివచ్చితిని. అమ్మెదరా ? యని యడిగిన నా పెంపుడు తల్లి వాకిటకు వచ్చి నీదేయూరు ? ఎంత వెల యియ్యగలవు ? ఎవ్వరికి గావలయునని యడిగిన నాదూతిక కాళిందీపురంబునఁ జంద్రవతి యను వేశ్యకు గావలసియున్నది. దాని భాగ్యమునకు మితిలేదు. పిల్లలు లేరు. బాలికం జూచి మాకు నచ్చెనేని వెలమాట మాటాడుకొందమని పలికినది.

అప్పు డా యిల్లాలు నన్నుఁ బిలిచి యిది నాకూఁతురు. దీని చక్కఁదనముఁ జూచినవారెల్ల దీనికి విద్యఁజెప్పింపుమని మమ్ము నిర్భంధించుచున్నారు. మా కట్టి సామర్ధ్యము లేదు. వేశ్యల కిచ్చితిమేని నన్ని విధముల సుఖింపగలదని నిశ్చయించి యట్లు ప్రకటించితిమి. మీకిది నచ్చకుండునా? దీనివెల నూరుమాడలు




సత ఇ4