సరోజిని కథ
213
మీ కిష్టమున్న నా సొమ్మిచ్చి దీనింగొనిపొమ్ము. లేకున్న నూరక పొమ్మని పలికిన విని యా దూతిక సంతసించుచు నప్పుడు యప్పఁడతి కావెల యిచ్చి నన్నెత్తికొని లాలించుచు నీయూరుఁ దీసికొని వచ్చి యీ చంద్రవతి కిచ్చినది.
నన్నుఁ జూచి యీవేశ్య యాశ్చర్యమందుచు దూతికకుఁ బారితోషిక మిచ్చి నా మేనంతయు బంగారమయముఁ జేసి నా ముద్దు మాటలచేఁ గాలక్షేపముఁ జేయుచుఁ గన్నపుత్రిక కన్న నెక్కుడు గారాబముగాఁ బెంచుచుఁ దగు గురువుల నియమించి సంగీతము సాహిత్యము నృత్యము నభినయములోనగు విద్యలెల్ల నేర్పించినది అల్పకాలములోఁ బెక్కు విద్యలలోఁ బాండిత్యమును సంపాదించితిని. అంతలో నా మేన బాడు యౌవనము పొడసూపినది. నాకు గన్నెరికము చేయుటకుఁ బెక్కండ్రు ధనికులు వార్తల నంపిరి అదియు నాకు బోధించినది. నేనందుల కంగీకరింపక పెండ్లిఁ జేయుమని ష్రార్ధించితిని. వేశ్యావృత్తిగా నుండుమని నన్ను నిర్భందించుచున్న ది. ఈ విషయ మిరువురకు నేఁటివరకుఁ దగవు జరుగుచునే యున్నది. నాకది యేమియోగాని పెండ్లి యాడి పతివ్రతనై కీర్తి సంపాదింపవలయునని యభిలాష కలుగుచున్నది. చావునకైన నొప్పెదనుగాని నీమాట కంగీకరింపనని చెప్పితిని. నేఁడు మీ నిమిత్తమై నన్నెంతేఁ బ్రతిమాలినది నిర్భంధించినది. తర్జించినది. ఆ మూర్ఖురాలితోఁ బ్రసంగించుటకంటే మీ పాదములమేదనేపడి బ్రతిమాలుకొనుట యుచితమని తలంచి యేమియు మాటాడితినికాను. ఇదియే నా వృత్తాంతము. మదీయ పూర్వపుణ్య పరిపాకంబునంజేసి కరుణారసపూరిత హృదయులగు మీరు దయచేసి నా మాట మన్నించితిరి మీ యెడఁ గృతజ్ఞురాలనై యుండెదను. నాయెడ నకారణ వాత్సల్యముఁ జూపిన మీ కుల శీలనామంబులు విన నామది తొందరపడుచున్నది ఏ దేశపు ప్రజలు మీ వియోగమునకు దుఃఖించుచున్నారు? ఏ మహారాజు మిమ్ముఁ బుత్రుగాఁ బడసి కృతార్దుఁడయ్యెదను ? మీ యభిధాన వర్ణంబు లెట్టివి? మీ వృత్తాంతముఁ జెప్పి మదీయ శ్రోత్రానంద మాపాదింపుఁడని వేడుకొనిన విని యతండు విస్మయ లజ్జా విషాద సంభ్రమంబులు మనంబునం బెనంగొన నొక్కింత ధ్యానించి యిట్లనియె.
చెలీ! నా కథ వినిన నీకును వ్యధఁ గలుగక మానదు. నేను క్షత్రియకులుఁడఁగాను. బ్రాహ్మణ పుత్రుండ నాపేరు ఘటదత్తుఁడండ్రు. నాకు దేశములు లేవుగాని చిన్నతనమందే రాజావలంబనముఁ గలిగి ప్రధాన పదవి నదిష్టించితిని అకారణముగా నాపై రాజునకుఁ గోపమువచ్చి నిరాకరించిన నూరు విడచి తలిదండ్రులకుఁజెప్పక యొక్కరుండ నొక్క మహారణ్యంబునం బడిపోయితిని నాటి మద్యాహాతపమునాటి యొడలెఱుంగక నొకచెట్టు నీడంబండుకొని నిద్రఁ బోయితిని.
దైవికముగా నలువురు దొంగలాయుధపాణులై యా మార్గముఁ బోవుచు