210
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
బెనిమిటిని మన్మధునిగాఁ జూచుకొనియెదను. ఇష్టమున్న నట్లుచేయుము. లేకున్నఁ జంపివేయము. అని ప్రత్యుత్తరము చెప్పినది.
ఆ మాటవిని యా వేశ్య చాలుఁజాలు. ఇదియా నీ యభిలాష ? నేనెన్నియో యిడుమలంబడి గడియించిన విత్తమంతయు నీ వొకమగనితోఁ గులుకుచుఁ గఱచు పెట్టెదవా ? అమ్మా ! ఎంతకాణాచివే. నీ మాత్రపు గడుసుఁదనము నాకుఁ జిన్నప్పుడు లేక పోయినదిగదా ? నేనునుం బెండ్లి యాడిన నీ పని యేమగునో ? మేడలును మిద్దెలును నీ పాటికిఁగూటికి లేక నమ్ముకొని పోకుందుమా ? ధనము ప్రోగు చేయఁబట్టియే యిన్ని పోకడలు పోవుచున్నావు. నీకు హితముఁ జెప్పినది దెలియకున్నది. ఏమి సేయుదును? పెండ్లి యాడినచో మగనియానతికిలోనై వర్తింపవలయుం గదా? దాన స్వేచ్చకు భంగము కలుగును. మరియు నత్తకును మామకునుమరదులకును లొంగి తిరుగవలయును. హావభావముల వెలయించుటకు నవకాశములేదు. అభిలాషలు మనసుననే జీర్ణము కావలయును. విద్యలకు ఫలము లేదు. ఇతరులఁ గన్నెత్తిచూచినఁ దప్పుసేయుదురు. పెండ్లి పెండ్లి యని యూరక పలవరింపుచుంటివి. అదెన్ని దోషములు కలిగియున్నది. అంగహీనులకును రూపహీనులకుం బెండ్లి కాని నీ వంటి జగన్మోహన రూపముగల కలకంఠికిఁ బెండ్లి యేమిటికి ? నిన్నుఁ జూచిన నింద్రుండైనను సంకిలి కాకుండునా ? నాకుఁ జిన్నతనమునం దిట్టి రూపమే యుండినచో భూమండల మంతయు నేలకపోవుదునా ? గ్రుడ్డికన్ను తెలియ నీయక చెవుడుఁగప్పిపుచ్చి మొగము రాచి రాచి యొడలు తోమి తోమి లేనియందముఁ దెచ్చి పెట్టుకొని యింతద్రవ్యము సంపాదించితిని. నా చూడని విటులును నే నెరుఁగని సుందరులును లేరు. రూపము లేకున్నను మాటల చేతనే వలపుఁ గలుగ జేయుదానను. ఆహా ! వేశ్యాజన్మముకన్న నుత్తమమైన జన్మముకలదా ? స్త్రీలలో గణికయే పొగడఁదగినది. నా హితము విని వివాహాభిలాషవిడిచి వేశ్యాధర్మముల నవలంబింపుము. ప్రాయము రిత్త సేయకుము. ఇంతయేల? నేడు వచ్చిన రాజపుత్రుఁడు నీకు నచ్చనిచో నా మాట యెన్నఁడును వినవద్దు. వాని నీవు చూచి వరింపవేని నీకుఁ దప్పక పెండ్లి జేసెద నిదియే శపధమని బోధించిన విని యాతరుణీరత్న మేమియు మాటాడక యూరకున్నది.
అదియే యంగీకారసూచనమని సంతసముఁ జెందుచు నా వృద్ద వేశ్య సాయంకాలమునఁ బడకగది యద్భుతముగా నలకరించినది. సరోజిని వలదనుచుండ మెడ మణిహారముల వై చినది. తలపై రత్నంబులు జతపరచినది. మేన ---------- దొడిగినది. ఇట్లు సన్నద్దంబుఁ గావించి తదాగమన మభిలషింపుచున్నంత-
అ. ఒకడు గొడుగు బట్ట నొకఁడు --------
బాదుకల నొకండు బట్టి నడువ
నొకనికేలునట్టి యొయ్యారముగ వచ్చె
బొందు గోరి రాజనందనుండు.