Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(27)

సరోజిని కథ

209


ఎనుబది ఐదవ మజిలీ

సరోజినికథ

పుత్రీ ! సరోజినీ ! నీవు నామాటఁ బాటింపక వేశ్యావృత్తి గర్హితమని నిందించుచుంటివి సృష్ట్యాదినుండియు వారాంగనలకథలు వ్రాయఁబడియున్నవి. దేవలోకముననున్న రంభోర్వశీ మేనకా తిలోత్త మాదులు వేశ్యలనియే చెప్పుదురు. మనము తత్సంతతివారమే. అదియుంగాక పౌండరీకమను క్రతువునకు వెలయాండ్రు గూడఁ గొండొక సాధనముగా నిరూపింపఁబడి యుండిరి. వేదచోదితములై న గణికాగుణ ప్రవర్తనములు నీకు మాత్రము దోషపాత్రములై నవి. మనకుఁ గల గౌరవము నీ వేమెరుంగుదువు ? అతి పవిత్రమైన గీర్వాణభాష స్త్రీలలో మన మొక్కరమే చదువఁదగియుంటిమి. పురాణగాథ లన్నియు నాలించియు నీ వింత మూర్ఖత గావించిన నాకుఁ గోపమురాక మానునా ? ఇప్పుడు త్రిలోకాభి రాముఁడగు రాజపుత్రుఁ డొకఁడు నలువురు పరిచారకులతో నీ యూరు వచ్చి నీ రూపగౌరవములు విని తాంబూలమిచ్చి పోయెను. ఆసేచకములై న తదీయ రూప రేఖా విలాసములుచూచి విడువలేక యతనిరాక కంగీకరించితిని. వానిం జూచితివయేని నీ నియమంబులన్నియుఁ బటాపంచలై పోఁగలవు. నీవు వానికిం దగియుంటివి. నిన్నుఁ జూచిన నతండు తన రాజ్యమంతయు నీ యధీనము సేయక మానఁడు. భవదీయ శృంగార తిలా చాతుర్యములు చూపింప నవసరము వచ్చినది. ఇంత దనుకఁ దగిన విటుండు దొరకమి నీ మాటలకుఁ దాళి యుంటిని. ఇప్పు డంగికరింపవేని నింతకన్న నధికశిక్షఁ గావింపక మాననని కాళిందీపురంబున జంద్రపతియను వృద్ధవేశ్య సరోజనియును తన కూఁతు నిర్బంధించిన నమ్మించుబోణి కన్నీరుఁ గార్చుచు నిట్లనియె.

తల్లీ ! నీయుల్ల మింత పాషాణమైనదేమి ? నీవు పెక్కండ్ర ధనికుల మోసపుచ్చి కావలసినంత ధనము సంపాదించితివి. అదియే మూడు తరంబులదాక యధేష్టముగా వాడుకొనినను దరగదు. ఎల్లకాల మొక పగిదియే దుష్కృత్యము జేయవలయునా ? నీవు పరమున కేమి సంపాదించుకొని పోయెదవు? ఇఁక నెన్ను నాళ్ళు బ్రతికెదవు? దుర్వృత్తిగా నార్జించిన ద్రవ్యము దొంగల వలననో దొరల వలననో నాశనము నొందక మానదు. లేని మక్కువలు ప్రకటించి వలపుఁ గలుగఁజేసి పలుకుల నమృతముఁ దొలిగించుచుఁ జిట్టమువంటి మనసుతోఁ గుటిల ------- వర్తనముల విటుల ద్రవ్యముల దోచికొను పాటవము నాకులేదు. మన వృత్తి సవ్వృత్తి యని పొగడుచుంటివి. పెద్దపులికైన నయగలదుగాని‌ వెలయాలికి దయలేదు. అట్టి ------ ప్రవర్తనమునకు నా మనసు దొరకున్నది. నన్నొతనికిచ్చి పెండ్లిచేయుము. వానినే దైవముగాఁ జూచుకొనుచుఁ బతివ్రతనై పేరు ప్రతిష్ఠల సంపాదించెద నిదియే నా కోరిక. మన్మధుండు విటుండై వచ్చినను నంగీకరింపను. కురూపియైనను