Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(4)

వీణావతి కథ

25

దైవికముగా నీనడుమ గిరిదుర్గపట్టణంబున కరిగితిని. తత్పట్టణాధీశుండైన యింద్రమిత్రునకు లేకలేక దర్గాప్రసాదంబున స్వయంప్రభయను కూఁతురు కలిగినది. అమ్మించుబోణి క్రొత్త విరించిచే సృష్టించబడినది గాని పాతబమ్మ సృష్టిలోనిదిగాదు. ఆహా! ఆ మోహనాంగి సౌందర్య యెన్ని యేండ్లు చూచినం దనివి తీరదుగదా! ఆమె కన్నులెత్తి చూచిన మాట్లాడిన మాబోటులకే బ్రహ్మానందపద మందినంత సంతోషము గలిగినది.

ఉ. సౌరభయందు కాంచనఁపు జంత్రపుఁబుత్రిక వాగ్విలాసముల్
    వారక నేర్చురత్నఁపుశలాక తిరంబగు రూపుఁజెందు తొ
    ల్కారుఱుంగు జీవకళఁ గాంచిన చిత్తరుబొమ్మయాన శృం
    గారిణియౌ సుధాసరసిఁగా నుతిఁ జేయఁగవచ్చు నచ్చెలిన్.

ఉ. విండ్లను మేల్తరంబు ఘనవేణి కనుంబొమ్మతోయి బంగరుం
    గిండ్లకు మేటిసాటి తులకించు చనుంగవ లేతతమ్మి పూఁ
    దూండ్లకు మిన్నయన్న జిగిదొల్కెడు చేతులు లోకమందు పూఁ
    బోండ్లను గానమో వినమొ పోలకు తత్సతి కాలిగోరునన్.

క. తొడలందము కటిచందము
   నడుగుందమ్ములబెడంగు లాస్యమురంగుల్
   జడతళుకు న్మెడకులున్
   నడబెళుకునూడ నాఘనస్తని కమరున్.

క. కందరమా చెలిపొక్కి
   కందరమా విలసనంబు కచము రదంబుల్
   కుందరమా సమములు నా
   కుం దరమా పొగడనలకు కుందర సుదతిన్.

గీ. చిన్న చీమల నునుబారు చెలువయూరు
    కదళికాండములమీరు కాంతయూరు
    అందములఁ జెందు రతిగేరు నతివసారు
    దాని కెనయైనవార లిద్దరణి లేరు.

రాజపుత్రా! ధాత్రీతలంబునం బ్రఖ్యాతివడసిన రాచకన్నెల నేనరం జూచియుంటి. మాట్లాడితిని. మెచ్చుకొంటి గాని యీ సుందరీ రత్నమువంటి వాల్గంటి వంటివలంతి నెక్కడను లేదు. లేదు. లేదు. పుడమింగాదు లోకమునను లేదని చెప్పగలను. సుని గరు వారగ సిద్ధి విద్యాధిని గంధర్వ కన్యలకైన లోపము అంచపోవు. ఈ పూఁబోణి కే కొదువయు లేదు. అవయవములన్నియు వ్రాసినట్లు తీర్చినట్లు మెరయుచున్నవిగదా అమ్మకు చెల్లా! అది