196
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
మీ గురుని యానతి వడసియే నేను మిమ్ముఁ బెండ్లి యాడెదను. వ్రతభంగమున కాయనమాత్రము సమ్మతించునా ? శివధనుర్భంగము ఎక్కువగాఁ జేసికొనిన సీత విష్ణుండు కోరినను నప్పని కొఱంతగాఁ బెండ్లి యాడునా ? అని యనేక దృష్టాంతరములు సెప్పి యతని నిరుత్తరుంజేసినది.
కాంతిసేన యప్పుడే తగు దూతలం బంపి జలంధరు నచ్చటికి రప్పించి వినయముతోఁ దనవ్రత పవృత్తియు రత్నపాదునిచిత్తవైముఖ్యతయు నెరిఁగించి ఆర్యా ! మీరే నాకుఁ దండ్రులు. తగినవరునికిచ్చి పెండ్లిఁగావింపుఁడని ప్రార్థించుటయు నా తపస్వి యా రాజపుత్రికా మతి కౌశల్యమునకు సంతసించుచు రత్నపాదునే వివాహముఁ జేసికొమ్మని యాజ్ఞాపించెను.
గురుననుమతి వడసి రత్నపాదుండు శుభ ముహూర్తంబునఁ గాంతిసేనం బెండ్లియాడి కామందకుండు ప్రధానియుఁ గరభ శరభ శంతనులు పరిహాస సఖులుగాను వీర సేనుండు సహాయుండుగా నొప్పుచుండ నా రాజ్యంబుఁ బెద్దకాలంబుఁ బాలించెను.
కష్టపడి యొకరు సంపాదించిన ద్రవ్యము వేరొకరు సుఖముగా ననుభవింతురను వాడుక యీ కథవలనఁ దెల్ల మగుచున్నది.
గోపా ! ఇంద్రజాలాది విద్యల ప్రభావం బిదియేసుమీ ? యని యెరిఁగించి మణిసిద్ధుండు శిష్యునితో నవ్వలి మజిలీ చేరెను.