పుట:కాశీమజిలీకథలు-06.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీణావతి కథ

23

లీలావతియు బిరుదపత్రములం గైకొని నగరున కరిగి సహదేవుని గృహ మెరిగి యతనిఁగాంచి సమస్కరించినది. అప్పుడా రాజకుమారుం డొకవీణియ ముందిడుకొని పాడుకొనుచు లీలావతిం గాంచి నీ వెవ్వతె వేమిటికి వచ్చితివని యడిగెను. అదియుఁ దనకూతురు వీణావతి సంగీతము పాడఁగలదనియు సభఁ జేయించవలయు ననియును గోరికొనిన సంతసించుచు నతం డారేయియే వారికిఁ బాడుట కనుజ్ఞ యిచ్చెను. లీలావతి యట్టియుత్తరువుఁ గొని సత్వరముగ బస కరిగి వీణావతిం గాంచి పుత్రీ! మనము చిత్రఫలకములోఁ జూచిన రాజపుత్రుం గనుఁగొంటి. వాని యందము చిత్తరువునం దున్న దానికన్న మిన్నగా నున్నది. అతండు వీణఁ బాడుటయేగాక విన్నాణముగా వీణలం జేయఁగలడట అతం డాలాపించెడి విపంచి నీవ ల్లకిం బురడించి యున్నది. ఆసంగీత విద్యావిశారదునియెదుట నీవుపాడి మెప్పువడయఁగలవో లేవో యని సందియమందుచుంటి. ఈ రాత్రియే పాడుటకు సెలవందికొనివచ్చితి. తరువాత నీ యిచ్చవచ్చినట్లు చేయుము. నీకు వీణలేదని చింతయక్కరలే తన వీణమీఁదఁ బాడినవారికిఁ బారితోషిక మిత్తునని యతండు ప్రకటించియున్న వాఁడట. అని వాని వృత్తాంతమంతయుఁ జెప్పుటయు నాలించి యమ్మించుబోణి యిట్లనియె.

అమ్మా! పోనిమ్ము. పాడితినా కానుకలందెదను ఓడినాశిష్యురాలనై విశేషముల గ్రహించెదను. దీన మనకువచ్చినకొదువయేమి యని యుబ్బుచు నావగలాడి రాత్రి యెప్పుడు పడునని తొందరపడు చుండెను. అంతలోఁ బద్మినీకాంతుం డపరదిగంత నికాంత విశ్రాంతికై యరిగెనోయన న స్తమించెను వీణావతియు వ్యభూషణమాల్యాను లేపనాదివస్తువిశేషముల నలంకరించుకొని యావిపంచీ ఖండములఁలట్టుకొని తల్లితోఁ గూడ బండియెక్కి, సహాదేవుని నివాస సౌధంబున కరిగినది.

రాజకుమారుం డంతకుమున్నే సంగీతసభాభవనము మనోహర దీపమాలికా విశేషములచే నలంకరింపజేసి దానిరాక కెదురుచూచుచుండెను. వీణావతియుఁ దల్లితో బరిచారిక నిర్దిష్టమార్జంబున సభాభవనమునకు వచ్చి తదీయ రూప విలాస విభ్రమాదులకు భ్రమఁజెందుడెందముతో నతనికి నమస్కరించి తదాజ్ఞ నుచితస్థానంబునం గూర్చుండి నూత్న వీణాదర్శనల లాలసయై యుండెను.

అంతలోఁ గింకరు లావల్లకిం దెచ్చి మెల్లగా నప్పల్లవపాణి మ్రోలం బెట్టిరి. ఆవీణం జూచి యాపూఁబోణి యురమున చేయియిడుకొని యమ్మకచెల్లా! ఈ పురుషపంచాననుండు నావిపంచిం గాంచి దీనిం గావించెనా? లేనిచో దాని మాదిరిగా నీవీణ నెట్లు చేయఁ గలడు. ఇది కడు చోద్యము, ఇది విచిత్రమని తలపోయుచు తన వీణాఖండములకుఁ దొలుత నమస్కరించి పిమ్మట నావల్లకిఁబట్టి చక్కగా --------- ------------- బాడినది. రాగమాధుర్యము, స్వరకల్పనలు, అంగుళీ విన్యాస భావము, తంత్రీనాదమేళనము, ముఖవిలాసము, నేత్రాభినయము లోనగు విషయములన్నియు రాజకుమారునికి మిక్కిలి విస్మయముకలుగఁ జేసినవి గానావసానంబున నా