కాంతిసేన కథ
173
పొలములోఁ బడియుండఁ గరభుఁడు చూచి యట్టిశవ మేదేని గనంబడినప్పుడు తనతోఁ జెప్పుమని కాంతిసేన నిరూపించియున్నది. కావున నాఁడు కరభుఁ మతెఱగు కాంతిసేన కెరింగించెను. రాజపుత్రికయే వాడికట్లు చేయుఁడని నియమించినది. కరభుఁడు పన్నిన జాలమేయని శంతనుం డా సన్నాహ మంతయుఁ గావించెను.
పిమ్మట వారు రాజుదేహ మంతఃపురమునకు దీసికొనిపోయిరి. రాత్రి సర్పదష్టుడై రాజు మృతినొందెనని ప్రతీతిఁ బుట్టించిరి. అప్పుడు రాజపత్నియు బుత్రికయు నా కళేబరముపైబడి విలపించుచు నపర సంస్కారములన్నియు విధి యుక్తముగాఁ జేయించిరి. వెనుకటి మంత్రులనెల్ల రప్పించి తదనుమతిని రాజ పుత్రికయే పట్టాభిషిక్తు రాలయ్యెను.
శంతనుండు కుమ్మరిబాలు నంతఃపురమునకుఁ దీసికొనిపోయి రాజపుత్రికకుఁ జూపెను. ఆమె వానికి శాలివాహనుడని పేరుపెట్టి తన యాస్థానమునకు వచ్చుచుండుమని నియమించినది. మరియొకనాడు కేశరిణి శాలివాహానుని చేయి పట్టుకొని యేకాంతముగా నెమ్మెకాఁడా? నీ రూపముఁ జూచి మా రాజపుత్రిక మిగుల మోహమందుచున్నది. శంతనుండు నీ మాట పలుమారు చెప్పుచుండెను. నీ యొద్ద నసామాన్యమైన విద్దె యున్నదఁట. అది రాజపుత్రికకుం కుపగా నిత్తువేనిఁ దప్పక నీకుఁ బెండ్లి చేయఁగలరు. రాజ్యముతో నీ కా చిన్నది దక్కఁగలదని యక్కలికి వలపులు మొలకలెత్తు పలుకుల నతనిం గలకపరచినది.
వాఁడా మాటలు సత్యములనినమ్మి కొమ్మా ? అమ్మానవతీ శిరోమణి నా యర్దదేహ మగచుండ నా విద్య యిచ్చుటకు యబ్బురమా ? ఇప్పుడే ధారవోఁసెద. దీసికొని రమ్మని పలికెను అప్పుడా కేసరిణి వాని నంతఃపురమునకుఁ దీసికొనిపోయి రాజోపచారములు సేయుచు నప్పుడే పెండ్లి కొడుకగునట్లు లాసఁ గొలిపి యా విద్య కాంతిసేన కుపదేశము సేయించినది.
అది మొదలు శాలివాహనుఁడు తానే రాజని తలంచుచు వీధిం బోవునపుడు సగర్వముగా నడచుచుండును. దేహబంధువులువచ్చి పిలిచిన వానిఁగన్నెత్తి చూడఁ డయ్యెను. కరభ శంతనుల కంతకుపూర్వమే ప్రభువులమని యభిప్రాయము గలిగినది. ఒకనాఁ డాకస్మికముగా శాలివాహనుఁడు కరభుం జూచి గురుతుపట్టి అయ్యో ? నా శత్రువు కరభుండిట కెప్పుడు వచ్చెను? వీడు వచ్చియే కాబోలు నా గుట్టుఁ దెలియఁ జేసెను. కానిమ్ము. నాకు రాజ్యము సంక్రమించనీ ? ముందుగా వీనిఁ గారాగారమున బెట్టించెదనని తలంచుచు వానితో నేమియు మాటాడక యెందేనిం బోవుచుండెను.
కరభుఁడు వాని యభిప్రాయము గ్రహించి వెన్నంటి నడిచెను. అంతలో శంతనుఁ డెదురుపడుటయుఁ గరభుఁడు పరిహాసముగా వానితో సంభాషించెను. వా రిరువురు మైత్రియుం గినియుచు శాలివాహనుఁడు నిలువంబడినంత శంతనుఁడు నవ్వుచు