172
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
భాగ్యమే మున్నది ? ఆమె నిమిత్తమే యీ విద్య శంతనున కీయఁ దలంచుకొంటిని. ఆమె వలదన్నపని చేయుదునా ? నా యర్ధ శరీరము కాదా ? ఇష్టమైనచో నిప్పుడే ఆ విధ్య యామె కిచ్చుచున్న వాఁడ. పోయి చెప్పుమని పలుకుటయు నతనివెంటఁ బెట్టుకొని యప్పుడే యప్పూబోడి కాంతిసేనవద్దకుఁ దీసికొనిపోయి యా విద్య యా చిన్నదాని చేతిలో ధారవోయించినది.
అది మొదలు కరభ శంతను లిరువురు నొకరికిఁ దెలియకుండ నొకరు శుద్ధాంతమునకు వచ్చి కేసరిణితో ముచ్చటించి పోవుచుందురు. ఒకనాఁడు రాజు శంతనునితోనే డా యుద్యానవనమునకుఁ బోవలయుననిచెప్ప నతండు కరభుని వెనుకటిజాలము పన్నుమని నియోగించెను. కరభుఁడు కేసరిణీముఖంబున రాజపుత్రికకుఁ దెలియజేయుటయు నా తరుణి యతి మనోహరముగా నా జాలముఁ బ్రయోగించిన కరభ శంతనులకు మరికొన్ని యుపాయములు చెప్పి పంపినది.
శంతనుఁడు వాడుకప్రకారము రాజుందీసికొని యా తోట కరిగెను. కరభుఁడు రహస్యముగా వారి వెంటఁ బోయెను. ఆ మాయావతి నాడు శృంగారలీలల వేనవేలు ప్రకటించుచు రాజును మోహసముద్రములో ముంచినది. అతండు తమినిలుపలేకఁ దన్నుఁ బెండ్లి యాడుమని నిర్భందించుచు జాలములో వరించిన చిన్నదానికేలు పట్టుకొనియెను.
అప్పుడా చిన్నది మనోహరా ! నాకొక నిక్షేపము కలదు. చిరకాలము నియమముఁబూని దాని సంపాదించుకొంటిని. ఈ బాలుఁ డదియున్న తా వెరుఁగును. వీడు హఠాత్తుగా మృతినొందెను. వీనితో మూడుమాట లాడవలసియున్నది. దీనిం బ్రతికించి మాటాడింతువేని నిన్నిప్పుడే పెండ్లిఁ చేసికొనియెదనని మోహోద్రేకములైన పలుకులు పలుకుచు నతనికి వలపు బలియ జేసినది. అతం డిదియెంత పనియని పలుకుచు నప్పుడు తన దేహము వేరొకచక్కి దాచి యా చిన్నది చూపిన బాలశవములో బ్రవేశించి నన్ను నీవేమి యడిగెదవని నుడివెను. ఆయ్యవకాశము గ్రహించి కరభుఁడు వెదకి రాజశరీరమును రెండు ఖండములుగా నరికి యవ్వలికిఁ బారిపోయెను.
శంతనుఁడు అయ్యో ! అయ్యో ! రాజు నెవ్వఁడో వధియించెను. చచ్చి పడియున్నవాఁడని పలుకుచు నీవలకువచ్చెను శరభుఁడు తొట్రుపడుచు రాజ దేహములోఁ బ్రవేశింపవలయునని తలఁచెను. కాని అది ఖండములై యుండుట వీలుపడినదికాదు. అప్పుడు గోలున నేడ్చుచు బాలశవములోనుండి శంతనుతోఁ దన భంగపాటుఁ జెప్పుకొనియెను.
శంతనుఁడు అయ్యో ! నీ వెంత ప్రమాదము జేసితివి. నాతో జెప్పక యా దేహమును విడుతువా? కానిమ్ము ? ఇప్పుడైన నీ గుట్టుఁ దెలియనీయకుము. కాంతిసేనను నీకే యిప్పించి పెండ్లి చేయించెదనని యాస పెట్టెను.
ఆ బాలుండొక కుమ్మరివాఁడు. వాఁడు సర్పదష్టుండై మృతినొంది