వీణావతి కథ
19
లీలావతి యెదురువోయి లోపలికిఁ దీసికొనివచ్చినది. సంభ్రమముతో లేచి వీణావతి నమస్కరించి యెదుర నిలువంబడినది. పీఠోపవిష్టుండై యా భూపాలుండు వీణావతివి నీవేనా? నీవీణ మాస్వయంప్రభ విఱుఁగఁగొట్టినదఁట? యేమిటికి? అక్కడకుఁ బోయి నీవేమిచేసితివి? జరిగిన విశేషము లన్నియు సాంతముగా నుడువు మనుటయు నక్కుటిలాలక యలకలు సవరించుకొనుచు కన్నీరు దుడిచికొని యిట్లని చెప్పఁదొడంగెను.
దేవా ! దేవరయనుజ్ఞగొని సంగీతము పాడునిమిత్త ముమ్మ త్తకాశిని చెలిక త్తయ హేమయను చిన్నది నన్నాయుద్యానవన సౌధములోనికిఁ దీసికొని పోయినది. నేను భర్తృదారికం గాంచి నమస్కరించి యెదుర నిలువంబడినంత నన్నా నెలంత నేత్రాంతంబులం జూచుచు నీ వెవ్వతే వేమిటికి వచ్చితివి? యని యడిగినది. ఏ నెద్దియో చెప్పఁబోవుడు నామాట కడ్డమువచ్చి హేమ ఇందుముఖీ! ఈకుందరవదన వారసుందరి. దీనిపేరు వీణావతి ఈ గాయనీమణిని గాంథర్వంబులో సరస్వతి యపరావతారమని చెప్పుచున్నారు. దీని సంగీతమువిని మన మానందించు నిమి త్తమయ్యగారు దీని నిచ్చటికిఁ బంపిరి. పాట కనుజ్ఞయిత్తువే యని యడిగినది.
ఆమాట విని యాపాటలగంధి యించుక యాలోచించి తండ్రిగారి యానతి రిత్తపుచ్చనేల? యట్లె పాడవచ్చునని పల్కుచు నుద్యానవనవిహారార్ధమై బయలు వెడలుటయు హేమ నన్నుఁజూచి వీణావతీ! మే మిప్పుడే రాఁగలము. ఇంతలోఁ దంత్రుల మేళగించుకొనుచుండుము. అని చెప్పి యాయువతి ననుగమించి యరిగినది. నేనందు గూర్చుండి విపంచి నాలాపించుచుండ నయ్యండజయాన లిరువురుఁ బెక్కండ్రు చెలిక త్తియలు పరివేష్టింప వచ్చి యక్కూటంబునంగల పీఠంబులం గూర్చుండిరి.
పిమ్మట రాజపుత్రిక నామొగము చూచుచు నీకుఁబెండ్లియైనదాయని యడుగుటయు పల్కరించుటయే బహుమానముగాఁ దలంచి మురియుచు వినయముతో దేవి! నేను పెండ్లియాడలేదు. మాకులంబునఁ బెక్కండ్రు గన్యకలుగానే యుందురని యుత్తరము సెప్పితిని. అప్పుడా మగువ మొగంబున సంతోష మభినయించుచు స్త్రీలలోఁ బెండ్లి యాడనివారే యుండరఁట వరుని వరించనిచోఁ గులంబులో వెలి వేయుదురఁట నాకు లోకానుభవము లేదఁట: ఈ హేమ పెండ్లియాడుమని నన్నూరక నిర్భందించు చున్నది, నీకథఁజెప్పి, దాని కొకసారి బుద్ధిఁజెప్పుము. నీకు మంచి పారితోషిక మిప్పింతు ననుటయు హేమ పక్కున నవ్వినది.
అప్పుడా యించుబోణి యించుక యలుక మొగంబునందోప హేమమొగంబుఁ జూచి తలయూచుచు కానిమ్ము. నామాటలన్నియు నీకు నెక్కసక్కె ములుగా నున్నయవిలే అని పలికినది. చిరునగవుతో హేమ నాకు పాడుమని కనుసన్నఁ జేసినది అప్పుడు నేను చక్కని రాగమాలాపించి. ———