112
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
కనుపుము, మరియు నీవు కళారహస్య వేదివగుట నీ క్రీడలఁజొక్కి యక్కుసుమ కోమలి యొరుల వలవదు అని పలికిన నతండిట్లనియె తమ్ముడా ! అందులకే నేనుఁ దొలుతఁ బోవుదునని చెప్పితిని. బాహ్యరతోపచారములచే నా జవ్వని కుద్రేకముఁ గలుగఁ జేయవలయును. మరియుం బురుషుఁడు స్త్రీలయొక్క జాతియు స్వభావము గుణము దేశాచారము ధర్మము చేష్టలు భావములు ఇంగితములు తెలిసికొని యనుభవింపఁడేని యువతి వానిరతి కనుమోదింపదు. అదియుంగాక యాకోక స్తని విరక్తిఁ జెందియున్నది. తత్తడియుఁ బడఁతియు నొక్కటని యెరుంగుము. నేనుఁ బోయి యా మచ్చకంటిని మచ్చికఁజేసి పచ్చవిల్తుగేళికిఁ బురికొల్పివచ్చెద ననుమతింపుమని ప్రార్థించిన స్థూలజంఘుఁ డిట్లనియె నీవు బాహాభ్యంతర సురతవిశేషములచే శాస్త్రోక్తప్రకార మాప్రోయాలిం గలియుచుండఁ దెల్లవారకమానదు అప్పుడు నేనేమి చేయువాఁడ? నాకీశాస్త్రము లేమియొ నక్కరలేదు. అక్కర దీరుచుకొని యొక్కముహూర్తములో నరుదెంచెద నన్నే పోనీయుమని ప్రార్థించెను. నే నర్ధమూహూర్తములోనే యరుదెంచద నాకే యనుజ్ఞయిమ్మని యతఁడడిగెను. నా కంతకాల మవసరములేదు ఆలింగన సుఖంబిచ్చినఁ జాలుననుటయు నతం డదియు నేమొల్ల. నా ముద్దుగుమ్మ మొగ మొకముద్దు పెట్టుకొని వచ్చెద నిష్టమే యన నతఁడౌను నీవెప్పుడు నిట్లే యడ్డుచెప్పుచుందువు. నీతో నేస్తముకన్నఁ బగయే లెస్సయని తోచుచున్నదని యెత్తిపొడిచెను ?
అవును. నీ స్నేహమునంగాక నాకీసన్యాసి యోగమెట్లువచ్చును? అనంగ చంద్రికవస్తువు లెత్తికొని రమ్మనిచెప్పిన వాఁ డెవ్వఁడో జ్ఞాపకముండిన నీ మాటయేలఁ బలికెదవు ? చాలుఁజాలు. కొసరులు పలుకకుము నాకలుక వచ్చుచున్నదని తామ్రకేశుఁడు ప్రత్యుత్తరమిచ్చెను.
నీయలుక నాకు వెరపుఁ గలుగఁ జేయంజాలదు. నా చెప్పినట్లెల్ల నీవు పడతువా యేమిఁ నీ కప్పని యనుమతియేకావున నాచరించితివి. ఇప్ప డేమాట --- విననైతివి? నాకు సమయము దొరకక పోవదు. తెల్ల వారినీ అని స్థూలజంఘుఁడు బెదరించె
ఛీ ! రండాపుత్రుడా ? నీ వేమిచేయం గలవన గొత్తుకొన జూడుమని ముష్టియెత్తును. ఈ రీతి వారిద్దరు గొంతతడపు తగపుదాడి మరల సమాధాన ప చామ్రకే.(డే ముందు వోయినచ్చుటకు నిశ్చయంచుకొనిసరి. H తామకేఁడు లోనికిఁ బోయి తలుపు వైచికొనియెదను. స్థూలజం.. పిల సుబడి తలుపులు గొట్లము పెట్టి యిట్లుఁ జింతించెను. అన్నన్నా? వినవచినదాని దానికంటె నే నేమిటిఁ దక్కు వందనం నెరచి చొన్నకొంటి గుట్టు బయట పెట్టినచో నిరువురను చెరసాలకు లేవువ ఉత్తని ను పెట్టి.చీ వాణి బ్లెగిరిపడియెను. అక్కటా: డమ్మోహనాంగితో సుఫింపు