Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(15)

స్థూలజంఘ తామ్రకేశుల కథ

113

చుండ నే ననద నై యీవాకిటఁ బడియుందునా? దుగ్దగటంబు బిల్లియందోలె వాఁడా చేడియను వీడి యీవలకు వచ్చునా? ఎంతమోసపోయితిని. ఎంత వెంగలినైతిని పశ్చాత్తాపముఁ జెందుచు మరలఁ దలుపురంద్రములో మొగముపెట్టి మిత్రమా ! తామ్రకేశా ! తలుపులొకసారి తీయుము. మాటఁ జెప్పవలసి యున్నదని పిలిచెను కాని యతండు వినంబడినను మాటాడక తొందరపడుచు నామంచముపైఁ గూర్చుండి చీకటిలో నేమియుం గనఁబడమి నిట్టూర్పుసవంబట్టి తలయంపి గురుతుపట్టి శాటీపటంబుఁ దొంగించి అతివేగమునఁ దాటాలున వంగి మోముపై దంతక్షతములు నాటించెను.

అప్పు డాయోగి యదరిపడి లేచి యెవడురా? యెవఁడురా నా మొగము గరచుచున్నవాఁడని యరచుటయు నాతఁడు యోగియని గ్రహించి వెరచుచు మాటాడిన గురుతుపట్టునని స్థూలజుంఘుని బిలువక మంచముక్రింద దూరెను. అత్తెరంగెరుంగక స్థూలజంఘుడు ఓరి ! తామ్రకేశా ! తలుపుతీయవేమిఁ తీయకుము. తీయకుము తలాతులం దీసికొనివచ్చి పట్టియిచ్చెదఁ జూడుము అని యరచెను.

ఆ రొద వినిన యా యోగి మంచముపైఁ గూర్చుండి యేమియుం దెలియక దిగ్బ్రమఁ జెంది ఆ మాట్లాడు వారెవ్వరు ? దీపముదీసికొని రండు ఏమియుం గనఁబడదేమి యని పలికిన స్థూలజంఘుడు కంఠధ్వని గ్రహించి గురువనియెరిఁగి గొలుసుబిగియించి యవ్వలికిఁ బారిపోయెను.

అయ్యోగి మంచముదిగి నలుమూలలు దడిమికొని గోడలు తగులుటయు నది యొక చెరసాలగాఁ దలంచి యోహో ? నే నిచ్చటి కెట్లువచ్చితిని ? నా బుగ్గం గరచిన వారెవ్వరు? ఇందు భూతములు లేవుగదా? యని యనుకొనుచుండ విని తామ్రకేశుఁడు మంచముక్రిందనుండి, హూం, హాం అని యవ్యక్త ధ్వనిగా మూలుగు చుండెను.

ఎట్టి వేదాంతులకైనను మరణమన్న వెఱపుగలుగక మానదు. పిశాచ భీతి భ్రాంతివలనం గలుగునని యెరింగియు నా తపసి జడియుచు మంచముపైకెక్కి యో పిశాచమా ! నన్నేమిటి కీ యంధకార రూపమునకుఁ దీసికొని వచ్చితివి ? మా వలన నీకేమి ప్రయోజనము గలదు ? మేము సన్యాసులము. సంసారులఁ బీడింపుము. నీ కామితములు తీరుపఁగలరు. అని ప్రార్ధించుచుండ యతి భీతితోఁగూడ మంచము క్రింది హుంకారము లెక్కువ యగుచుండెను.

ఆ యోగీంద్రుఁడు హస్తాస్ఫాలనముఁ గావింపుచు నాంజనేయ దండకము శివస్తుతి, భగవస్తవము పఠింపుచుండెను. అంతలోఁ దెల్ల వారినది కాని యందున్న --- భేదమేమియుఁ దెలిసినదికాదు. మఠంబునఁ జిదంబరయోగి కనంబడమిఁ Oy: ఈ మహానుభావుందు ఆ ప్రాయముగల అగ్నికాలవిడిచి యిచ్చటికిఁ బోవ వాఁడు. నే డెందు వోయెనో తెలియదు. సిచిత్రమని తలఁచుచు నందుఁ కనబడినవారి తెల్ల నడుగుచుఁ దిరుగుమండ