స్థూలజంఘ తామ్రకేశుల కథ
111
స్థూల :- కొశ్కోకములో శ్రీవశ్య ప్రకరణముఁ జదివితిగదా. ఆ ప్రయోగ మీ యెలనాగపై నుపయోగించి స్వాధీనురాలిం జేసికొనరాదా ?
తామ్ర :- అందులకుఁ జాలతంత్రము కలదు. ప్రయత్నింతుము.
స్థూల :- ఆ తంత్రములేమియు ననంగచంద్రికపై నుపయోగించినవి కావేమి ?
తామ్ర :-- వేశ్యకాంతల వశ్యమునకు ధనయంత్రము తప్ప వేరొక తంత్ర ముపయోగింపదు గదా ?
స్థూల :- నీ మంత్రతంత్రములతో నిమిత్తములేకయే కమలను వశపరచెద నాకేమి కానుక నిచ్చెదవు?
తామ్ర :- (సంతోషముతో) నీ చెప్పులు మోసికొని యెల్లకాలము తిరిగెదను. ఆ యుపాయ మెరింగింపుము.
స్థూల :— వినుము. ఇది నిద్ర పోవుచుండ మెల్లగా మంచముతో నెత్తికొ'ని పోయి యా శూన్యాలయములో—
తామ్ర :- అవును. మంచియుపాయమే. ఆ చంచలాడి మంచముపైఁ బండుకొనుటయు మన కుపకారమే యైనది.
స్థూల :- నే నీ యుపాయంబుఁ జెప్పితినిగదా? ముందరిఫలము నాదిసుమా?
తామ్ర :- మనలో మనకు భేదమే మున్నది? ఎట్లయిననుసరే ఆ సరోజాక్షి యా సన్యాసిదాపుననే పండుకొనుచున్నది. కావున దాని మంచము గురుతుఁ జూచుకొనవలయును.
స్థూల :- సంతతము అగ్ని ప్రజ్వరిల్లుచుండును కావున దాని నారిపి మరియుం దీసికొని పోవలయుఁ జుమీ?
అని వారిరువురు నాలోచించుకొని సమయ మరసి కమలయు జిదంబర యోగియుఁ బండుకొను మంచములు ముందుగనే గురుతుఁజూచికొని పోయిరి. నాఁడు బైవిధంగాఁ గమల పరుండు చోట నాయోగి మంచము వైపించుకొని పండుకొనియెను.
ఆర్ధరాత్ర సమయంబున వారిరువురు మెల్లగా సచ్చటికి వచ్చి యగ్గి చల్లార్చి --- మార్పి యావిషయము తెలియమిం జేసి కాషాయాంబర ప్రచ్ఛన్నుండై యున్న యా చిదంబరయోగిని కమల యనుకొని మంచముతోఁగూడ నెత్తి కదలకుండ నా యావరణములో దూరము గానున్న యొక శూన్యశివాలయము లోనికిం దీసికొనిపోయి యందు ---------------------- వచ్చిరి.
అప్పుడు స్థూలజంఘుడు తామ్రకేశా ! నే నీ యుపాయముఁ జెప్పునప్పుడు ము చేసినదా? ఇప్పుడు నేను కిం తో నుంచి నించు గానియందుమని పలికిన నగండు చిన్న చనుగదా నా ముద్దె చెల్లించి నన్ను ముందే లోని