పుట:కాశీమజిలీకథలు-05.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మోము వంచుచు నతండు గౌగిలింపబోయిన నంగంబులు ముడుచుకొనుచు బెనిమిటి నిట్లు చేయవలదని చెప్పుడని చెప్పలేక నవ్వుచుండెడి సఖురాండ్ర మొగములు చూచుచు దనలో దానే సిగ్గుచే నవోఢ తొట్రుపడుచుండెను.

హేమ - లెస్సగా నున్నది యింకొక శ్లోకము.

మంజు -

శ్లో॥ కాంతేసాగసియాపితె ప్రియసఖీవేషం విధాయాగతె
     భాంత్యాలింగ్యదుయారహస్యముదితంతత్సంగమాపేక్షయా
     ముగ్దెదుష్కరఎషఇత్యతితరా ముక్త్వాసహానంబలా
     దాలింగ్యచ్చలిదాస్మి తేనకితవే నాద్యప్రదోషాగమె.

మద - అయ్యో! యీలాటి మాయలు చేయుచుండెను. ఇతనియందు శ్రీకృష్ణుని చర్యలన్నియు గనంబడుచున్నవి.

హేమ - నాకర్ధము చెప్పిన పిదపగాని మిమ్ము మాటాడుకొననియ్యను.

మంజు - ఇందు మణిమంజరి నాయకునిచే వంచింపబడి యావార్త సఖుల కెరిగించు విషయమును వర్ణింపబడినది. సఖులారా! ప్రియుని యపరాధ మెరింగి యింటికి రాగా గోపముతో బొమ్మంటి నావంచకుండు పోయి మదీయసఖీవేషముతో వచ్చి గురుతు పట్టజాలక సఖి యనుకొని కౌగలించుకొని "బోటీ యింటికి వచ్చినవానిని నిష్కారణకోపముతో వెడలుగొట్టితిని. నీవు పోయి వాని నెట్లయిన దీసికొని రమ్ము. లేనిచో బ్రాణములు నిలువవని" పలికిన నా రహస్యమును విని యతండు అగుంగాని యా కార్యము చేయుట దుర్ఘటమని పలికి నవ్వుచు నన్ను బిగ్గఱ గౌగిలించుకొని నేటి సాయంకాలమున వచించెను. అని మణిమంజరి సఖులలో జెప్పినది.

హేమ - మేలు మేలు. మణిమంజరిని జక్కగా వంచించె. మంచి చతురుఁడగు నింకొక్కశ్లోకము చదివి సంతోష పెట్టుము.

మంజు — శ్లో॥ అహంతేనాహూతాకి మసికథ యామీతివిజనె
                  సమీపేచాసీనా సరళహృదయత్వాదవహితా
                  తతఃకర్ణోపాంతెకిమపివదతాఘ్రాయవదనం
                  గృహీత్వాధమ్మిల్లంమమసఖీ! విపీతోధరరసః॥

మదన — అమ్మక్కచెల్లా! ప్రియుం డెంత మాయవాఁడే.

హేమ - అదిగో! నాకర్ధము చెప్పక పూర్వము మీరేమియు నా విషయము ముచ్చటింపగూడదని చెప్పియుండలేదా!

మదన - తదీయభావంబు మద్భావంబు నాకర్షించుటచే మఱచిపోయితిని. ప్రియుండు మన కాంచనమాల రహస్యస్థలమందు వసియింప మాటయని పిలిచి దగ్గిరకు