పుట:కాశీమజిలీకథలు-05.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

15

ముల యందు నియమమును విడువక కాలముల యందు నగ్ని నారాధింపుచు గురు నింట వేదాధ్యయనము గావింపుచుండెను. అతండు మిగుల బుద్ధిమంతుఁడగుటచే స్వల్పకాలములో వేదముల సాంగముగా నధ్యయనముఁచేసి శాస్త్రములయం దసమాన మైన పాండిత్యము సంపాదించి వేదార్థావబోధముఁ జక్కగా జేసికొని యనుభవమునకుఁ దెచ్చుకొనుచుండెను.

ఒకనాడుఁ గురుండు శిష్యులకు వేదార్ధమంతయు నుపన్యసించిన విని శివ గురుండవల్లన నాచార్యునితో నిట్లనియె, ఆర్యా! అర్ధావబోధము క్రియానుష్ఠానమే ఫలముగాఁ గలది గదా? వేదము మొదటఁ గర్మచేయుమని యెంతయో చెప్పిచెప్పి చివరఁ గర్మవలన నేమియుఁ బ్రయోజనము లేదనియు జ్ఞానమునంగాని మోక్షము కలుగదనియు నుడువుచున్నది. అట్లు చెప్పుటకు గారణమేమియో తెలియకున్నది తదభిప్రాయము వక్కాణింపుఁడని వేఁడుకొనియెను. అప్పుడు గురుండు మిగుల సంతసించుచు వత్సా! నీ ప్రశ్నము కడు గూడార్ధమైనది. వినుము. జననమరణాది సుఖ దుఃఖములకుఁ గర్మయె కారణమై యున్నది కర్మవలన జంతువు బొడముచున్నది. ఆ కర్మ యజ్ఞాన మూలకమైనది. యా యజ్ఞానము మాయాజనితంబు. కర్మవలనఁ బుట్టిన జంతువులకు నజ్ఞానము సహజంబై యుండును. జ్ఞానమాగంతుకము గావున సహజ గుణంబైన యజ్ఞానమెట్టివారికిని విడుచుట కష్టము. దేహధర్మము లెంతవాని నైన మోసము చేయక మానవు. ఇంద్రియ ప్రవృత్తి బలవంతమైనది. ఉపాధ్యాయుండు బాలురకు నక్షరబోధ చేయు తలంపుతో రుచులఁ జవిజూపు చందంబున వేదము ప్రకృతి వలన జనించి ఫలాపేక్షగల జంతువులకు ఫలము లెరఁజూపి కర్మలఁ జేయుమని చెప్పినది. కర్మలయందు నియమింపఁబడిన చిత్తము గలవాఁడు దృఢవ్రతుం డగుటచేఁ బైన నెట్లు చేయుటకును సమర్థుండగును. కావునఁ గర్తవ్యాంశములఁ బిమ్మట యథార్థముగా వక్కాణించినది. ఈ విషయ మనుభవగోచరము. పిమ్మట విమర్శింపవచ్చును. నీవు సమస్త విద్యలం జదివితివి. నీవు వచ్చి పెద్దకాలమైనది. మీ తలిదండ్రులు నీ కొఱకు వేచియుందురు. సత్వరముగా నింటికి బొమ్ము. బంధువులకు సంతోషము గలుగఁజేయుము. కాలమునకు మిక్కిలి వేగము గలదు. దేహంబుల క్షణభంగురములు. రేపు జేయఁదలచికొనిన కార్యములు నేఁటి యుదయముననే చేయవలయును. కాలమున నాటినసస్యమువలె విపరీతకాలమున నాటిన సస్యము సంపూర్ణఫలము నీయజాలదు. అట్లే వివాహాది కృత్యంబులు యథాకాలంబున నిర్వర్తించిన మంచి ఫలంబుల నీయఁజాలును మఱియుం గుమారుండుదయించినది మొదలు తల్లిదండ్రులు వత్సరములు గణింపుచు వివాహాద్యుత్సవములఁ జేయఁదొందరపడుచుందురు. తమకు బిండధాదృలోపము గలుగునని పితృదేవతలు తమకులీనుని వివాహక్రియఁ గోరుచుందురు. కావున నీవును సలక్షణయగు కన్యంబెండ్లియాడి గార్హస్థ్యధర్మముల యథాశాస్త్రముగా నడుపుచు యజ్ఞములచే వేల్పుల దృప్తిపరచి నిష్కర్ముండవై ప్రవ