పుట:కాశీమజిలీకథలు-05.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

కాశీమజిలీకథలు - ఐదవభాగము

క. విద్యాధిరాజునానిర
   వద్యయసోనిధియొకండు బహుళకళాసం
   పద్యోగశాలిదనరున్
   సద్యోగార్చితసుపర్వసంఘుండగుచున్.

సీ. సతతంబుశాస్త్ర చర్చలు సేయుచుండుఁద
           ద్గేహాంకశారికా కీరచయము
    నిగమశేఖరతత్త్వ నిశ్చయార్థముల భా
           షించుఁదన్మందిర స్త్రీజనంబు
    వివిధాధ్వర క్రయా నివహంబులను బ్రస్త
          రింతు రర్చకులు గ్రీడాంతరముల
    సత్పురాణకధా ప్రసంగముల్గావించుఁ
          జెలఁగితద్దాసదాసీజనంబు

గీ. లనినచో నమ్మహాత్ము విద్యాతిశయము
    వేఱేవర్ణించినుతులు గావింపనేల
    సార్థకాహ్వయుఁడాసూరి చక్రవర్తి
    సాధుమతిదానజిత బలిచక్రవర్తి.

అట్లు విద్యాధిరాజు సకల విద్యా ప్రవీణుండై సురభూసుర స్తవనీయ చరిత్రుండై యయ్యగ్రహారమున వసియించి పూర్ణానదీస్నానంబు వృషాచలేశ్వరుని సేవయుం బ్రధానములుగాఁ జేసికొని తత్వగోష్ఠి విశేషములచేఁ గాలక్షేపము సేయుచుండఁ గొండొక కాలంబునకుఁ దత్పత్ని యంతర్వత్నియై శుభముహూర్తంబునఁ బుత్త్రరత్నమును గనియెను. మిగుల సంతోషముతో నాపాపనికి విద్యాధిరాజు యథాశాస్త్రముగా జాతకర్మాది సంస్కారముల నిర్వర్తించి శివగురుండని నామకరణము గావించెను.

శివగురునికథ

ఆ బాలుండు శిశువిలక్షణ వ్యాపారములు గలిగి దివ్యతేజస్సంపన్నుండై బాలమృగాంకుని పగిది ననుదిన ప్రవర్ధమానుండై యొప్పుచుండెను మఱియు నప్పండితుండు శివగురునికి యథాకాలంబున నుపనయనము గావించి సమీపగ్రామంబున వసియించియున్న యొక్క పండితునొద్ద విద్యాభ్యాసము గావింప నప్పగించెను. శివగురుఁడు గురుని శివునిఁగాఁదలంచుచు యథావిధి బ్రహ్మచర్యవ్రతం బొనరింపుచు జ్ఞానంబున శివుఁడే యనఁదగి సతతము గురుశుశ్రూషాపరుండై యశసపానశయనాది వ్యాపార