పుట:కాశీమజిలీకథలు-05.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అది పురుషతంత్రమైనదగుటచే నిష్టము వచ్చినట్లు చేయుటకును జేయకపోవుటకును మరియొకరీతిఁ జేయుటకును శక్యమగుచున్నది. కాని జ్ఞానంబున కట్లుగాదు. కావునఁ దజ్జన్యమగు ముక్తి కనిత్యత్వము సిద్ధించదు.

మండ — మునిసత్తమా! తత్త్వమసీతివాక్య ముపాసనాపర్యవసాయి కాకపోయినను జీవునకుఁ బరమపురుషునితో సాదృశ్యమును బ్రతిపాదించుచున్నది గదా?

శంక - ఓహో! పండితాగ్రేసరా? తత్త్వమసీతివాక్యము జీవున కీశ్వరునితోఁ జేతసత్వపాధర్మ్యము చేతసాదృశ్యమును బ్రతిపాదించుచున్నదా లేక సర్వజ్ఞత్వ సర్వాత్మత్వ సర్వశ క్తిత్యాదిగుణములచే సాదృశ్యమును జెప్పుచున్నదా? నుడువుము. చేతసత్వముచేత నంటివేని యయ్యది ప్రసిద్ధమైనదగుటచేత నుపదేశమున కేయవసరము లేదు. సర్వజ్ఞత్యాదిగుణముల చేత నంటివేని, జీవునకుఁ బరమాత్మ స్వరూప పత్తితోన భేదము లేదని చెప్పెడు స్వసిద్ధాంతమునకు విరుద్ధమగును గదా! కావున నీ ప్రశ్న మైక్యమునే ప్రతిపాదించుచున్నది సుమీ?

మం — తత్త్వమసీతి వాక్యము అవిద్యావృతివలనఁ బ్రతీతములు గాని సుఖబోధానంత్యాది గుణములచే జీవునకుఁ బరమాత్మతో సాదృశ్యమును జెప్పుఁగాక దాన నుక్తదోషము లేదు గదా?

శంక — సుహృద్వరా! భవదీయవాక్యంబే జీవునకుఁ బరమాత్మత్వ మాపాదించుచున్నయది యికఁ దద్విషయయై కోప మేమిటికిఁ జేసెదవు. సుఖబోధానంత్యరూపమగు పరమాత్మతత్త్వమునకుఁ బ్రతిభాసశంక యవిద్యావరణమువలన నీవే తీసివేసితివి గదా?

మం — భో యతిశ్రేష్ఠా. తత్త్వమసీతివాక్యము జగత్కారణుండైన యీశ్వరునితో జీవునకుఁ జేననత్వసాధర్మ్యము వలన సామ్యమును జెప్పుగాక. జగము చేతనము వలన బుట్టినదగుటచే సాంఖ్యాదులచే జెప్పబడెడు ప్రధానపరామాణ్వాదులకు నిరాసము కాగలదు.

శం — అయ్యో పండితపుంగవా! అట్లైనచో ద్వన్మతంబున దత్తమసీతిప్రయోగము తప్పగును. తత్త్వమస్తియని యుండవలయుం గదా! తత్ అజత్కారణముత్వం. త్వత్సదృశము అస్తియగును. అని యర్థము వచ్చును. జగంబునకు జడత్వశంక పోవుకొఱకు నట్లు చెప్పవలయు నంటివేని శ్రు॥ తదైక్షత బహుస్యాం ప్రజాయేయేతి. అను శ్రుతియందు గల యీ క్షణశబ్దసామర్థ్యంబున నది స్పష్టమగు చుండ నణుప్రధానాదులయొక్క నిరాసకొఱకని చెప్పుట యుచితముగా లేదు.

మం - తత్త్వమసీతి వాక్యమునకు నే నీశ్వరుడ గాను అను ప్రత్యక్షజ్ఞానము గలుగుచుండగా నైకపరత్వము జెప్పుట యుచితము కాదు కావున సాధ్యాయోధ్యేతప్యః అను విధివాక్యము ననుసరించి తత్త్వమసీతి వాక్యము జపింపదగినదై యున్నది. అంతకన్న వేరొకఫల మేమియు గలుగదు.