పుట:కాశీమజిలీకథలు-05.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

67


భట్టపాదుని కథ

సీ. వేద మెక్కుడటంచు వాదించి యెవ్వాడు బెనుకొండ తుదినుండి పృథివి కుఱికె
    సురగణం బెవ్వానికరుణచే నవహవిర్భాగంబురను దృప్తి బడసె మిగుల
    ధరణిసర్వామ్నాయతంత్రస్వతంత్రుడై యేసూరికీర్తి నెల్లెడల నిలిపె
    బటుశక్తిబౌద్ధచార్వాకాదిమతముల దండింపజేసె నే పండితుండు

గీ. అట్టి శ్రీ భట్టపాదుండు ప్రాప్తమైన
    గురుమథనదోషమును బాపుకొనుట కిప్పు
    డురుతుషాగ్నిఁ బ్రవేశించుచున్నవాడు
    అహహ! విజ్ఞానపరమార్ధుఁ డగుట జేసి.

అని యెవ్వరో చెప్పుకొనుచుండ విని యదరిపడి లేచి శంకరుండు శిష్యులతో గూడ నమ్మహాత్ముం డెక్కడ నెక్కడనని యడిగి తెలిసికొని సత్వరముగా నచ్చటికిం జని యందొకచో బ్రోగుగానిడిన యూకపై శయనించి యందుంచిన యనలంబును ప్రథితప్రభావులగు ప్రభాకరాదిశిష్యులు చుట్టునుం బరివేష్టించి కన్నీటిధారలచే దడుపుచుండ ధూమాయమానంబగు తదనలంబున నొడనెల్ల గమలినను వదనకమలంబు మాత్రము వికాససూన్యముగాక యొప్పుచున్న యబ్భట్టపాదుం గాంచెను. వేదమార్గరక్షకుండగు నా సూరివరేణ్యుండును దూరంబున నోరచూపులచే దనదెస కరుదెంచు నప్పారికాంక్షిం గాంచి యతని నంతకుమున్ను జూచి యెరుంగుకున్నను దదీయప్రఖ్యాతి వినియున్నవాడు గావున గురుతు పట్టి పట్టరానిసంతోషంబుతో దుషానలబాధం బాటింపక తన శిష్యగణంబులచే శిష్యులతోగూడ శంకరాచార్యున కిచ్చగింపకున్నను నపూర్వాతిథిసత్కారముల గావింపజేసెను. అట్లర్చితుండై శంకరుండు గుశలప్రశ్నానంతరంబున దనరచించిన సూత్రభాష్య మా విద్వాంసునికి సంక్షేపముగా జదివి వినిపించెను. దాని విని విస్మయమునొందుచు నప్పండితపురందరుండు ఆహా! భవదీయభాష్యప్రభావంబు వర్ణింప వాక్పతికైన వశంబా; అందు మొదటి యధ్యాయనంబునంగల నిబంధన లేతన్మాత్రములే? అది యొకండే యెనిమిదివేల వార్తకములతో నొప్పియుండవలయుం గదా! నే నీదీక్షయే వహింపకుండినచో నీ భాష్యంబునకు నద్వార్తికంబు రచియించి కృతార్థుండ గాకపోవుదునా! అట్టి యోగము నా కేల తటస్థించును. అది యట్లుండె మీవంటి మహాత్ముల దర్శన మగుటయే దుర్ఘటము. విశేషించి యట్టిసమయంబున లభించుట మదీయపురార్జితభాగధేయంబు గదా! సంసారసాగరంబున మునింగియున్నవారిం దరిజేరుటకు మీవంటి యుదారవృత్తుల సాంగత్యముగాక మరియొకసాధన మేమి యున్నది. చిరకాలమునుండి మిమ్ము జూడవలయునని నాకు దలంపు గలిగియున్నది. నేడుగదా నా మనోరథము సఫలమైనది. నరులకీ సంసారంబున నభిమతంబు దీరుట దుర్ఘటము. కాలం బొకప్పుడు మంచియు