పుట:కాశీమజిలీకథలు-05.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

కాశీమజిలీకథలు - ఐదవభాగము

సనందనునికి సూత్రభాష్యమును ముమ్మారు పఠింపఁ జేసి యందలి గూడార్థము లెల్ల వివరించి వక్కాణించెను. దానంజేసి వామదేవాది శిష్యులు దమ యాచార్యునకు సనందనునియం దెక్కుడు పక్షపాతము గలదని మనంబులందుఁ జింతుల్లుచుండెడివారు. తదభిప్రాయముల గ్రహించి శంకరాచార్యుం డొకనాఁడు సనందనుని భక్తివిశేషమితర శిష్యుల కెఱింగింపఁదలంచి సనందనుండు గంగానది కవ్వలి యొడ్డున నుండఁగా వత్సా! సనందనా! వేగముగా నిటురమ్ము? పనియున్నదని కేకవైచెను.

గురువచనము వినినతోడనే సనందనుఁడు దురంతమగు సంసార సాగరమునే దాటింప సమర్థమగు గురుపాదభక్తి యీ చిన్ననదిం దరింపఁజేయదా? యని నిశ్చయ భక్తి విశ్వాసములతో గంగానది నీటిపై వడివడి నడుగులిడుచు నడువఁదొడంగుటయు నత్తటినీవరం బతని యడుగునఁ బద్మంబుల నూతగా నిల్పినది. దృఢ భక్తి తాత్పర్యములతో నప్పద్మంబులం బాదంబు లిడుచుఁ గ్రమముగాఁ దన యొద్ద కరుదెంచిన సనందనునిఁగాంచి యానంద విస్మయ కందళితహృదయారవిందుడై యయ్యతిచంద్రుం డతని గౌఁగిలించు కొని యవ్విశేష మెల్లరకుం దెలియఁజేయుచు వానికిఁబద్మపాదుండను నన్వర్థనామధేయం బొసంగెను. నాట గోలె యమ్మేటి పద్మపాదుండనఁ బరఁగుచుండెను.

శంకరయతి యొకనాఁడు శిష్యగణంబునకు భాష్యము పాఠము జెప్పుచున్న సమయంబున పాశుపతాదిభేదవాద మతస్థులు తద్భాష్యమును బూర్వపక్షము సేయుట శంకరుండు శ్రుత్యుదాహరణ పూర్వకముగాఁ దదాగమములు మధింపుచుఁ గులిశ కఠినంబులగు తర్క ప్రహరణంబులచేఁ ద్రుటిలో వారిని గాందిశీకులం గావించెను. అట్లు శంకర కంఠీరవంబు వేదాంతకాంతారంబున సందర్శింపుచుఁ దీక్ష్ణములగు యుక్తి నఖాగ్రదంష్ట్రలచే భయంకరమై కుమతవాది మత్తగజంబుల మదం బడగింపుచుండెను. ఘర్షణచ్ఛేదన తాడనాదులచే సువర్ణంబు మెరుగుఁజెందెడి పగిది వాదులచే మధింపఁ బడిన శంకరభాష్యంబు మిక్కిలి ప్రఖ్యాతి నొందినది. తద్భాష్యామృతమునుగ్రోలి పద్మపాదాది శిష్యు లొకనాఁ డిట్లు సంభాషించుకొనిరి.

పద్మపాదుఁడు - వామదేవా! మన గురువరుని యాత్మనిష్ఠాతి శయత్వమునకుఁ బరితుష్టి వహించి విశ్వనాథుండు శారీరక సూత్ర భాష్యమును రచించుమని స్వయముగా నానతిచ్చెనుగదా! అమ్మహానుభావుం డట్టి భాష్యమును రచించి కుమత వంకనిర్మగ్నమై వ్యాసమహర్షిచే లేవనెత్తబడిన శ్రుతిలక్షణమగు వృద్ధధేనువును భాష్య సూక్తామృత సేచనంబున సేదదేర్చి ప్రబలఁజేసెను. గాంచితివే?

వామదేవుఁడు — అన్నా ! శంకరదుర్గ వార్ధింబొడమి విబుధుల కమృత మిచ్చుచు గోసముదయంబునఁగు మతాంధకారంబుల నడఁగించు భాష్యచంద్రబింబము నివ్రచకోరముల సంతోషపరచుట యబ్బురమా!