పుట:కాశీమజిలీకథలు-05.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

కాశీమజిలీకథలు - ఐదవభాగము

    నిరుపమ పరతత్త్వ నిరతత్వము వహింప
           వలయు గావున నట్టి పరమతత్త్వ.

గీ. లలిత సుజ్ఞానమునకు నాలంబసుడవు
    పరుఁడ వాద్యంతశూన్యుఁడ పురుమహత్త్వ
    ఖనివి యస్మదఖిన్నుడ పనుపమ ప్ర
    భావుఁడవు నీవు నీకిదే వందనంబు.

వ. అనియిట్లు గంభీరవాగ్గుంభనలచే నానందబాష్ప పూర్ణలోచనుం డై వినుతించు యతిపతింగాంచి జగత్పతి కృపారసంబు లొలుకు పలుకుల నిట్లనియె. వత్స! శంకర నీతపోధననైషికత్వము పరీక్షించుటకై యిట్లువచ్చితి. నీ యద్వైత బుద్దికి మెప్పువచ్చినది. వ్యాసుండువోలె నీవును మదనుగ్రహపాత్రుండవైతివి. అబ్బాదరాయణుండు వేదంబుల విభజించి యందు సమంచితముగా శిక్షితుండై బ్రహ్మసూత్రముల రచించెను. కాణాదసాంఖ్య పాతంజల ప్రభృతులగు మనంబులందు జక్కగా ఖండింపబడినవి.

కలిదోషంబున గొందరు మూఢమతులు తత్సూత్రసంతతులకు గుత్సితభాష్యంబుల విరచించిరి. అవియు బ్రబుద్ధులచే నిరసింపబడినవి. నీవు నిగమశిఖార్ధముల జక్కగా నెరింగిన ధన్యుడవు. గోవిందయతీంద్రులవలన దదర్థములన్నియు సంగ్రహించిన ప్రోడవు అన్నింటికిం దగియున్నవాడవు. కావున నిగమోద్భావితములగు యుక్తిప్రయుక్తులచే దుర్మతంబుల ఖండింపుచు సూత్రభాష్యము రచియింపుము. నీ రసించినభాష్యంబ నవద్యంబై పురందరాది బృందారక సందోహముచే సర్బనీయమై బ్రహ్మసభయందు సైతము పూజింపబడగలదు. మరియు నభినవగుప్త నీలకంఠ భాస్కరప్రభాకర మండనమిశ్రాది పండితమండనుల బ్రచండవిద్యావాదంబులనోడించి యద్వైతమతావలంబనులుగావింతువు. మోహధ్వాంత పద్మినేకాంతులగు ఛాత్రోత్తముల బరతత్త్వసరణి బరిపాలింపనందందునిలిపి పిమ్మట నన్ను గలిసికొందువని యనుగ్రహ పూర్వకముగా నెరిగించి వృషభతురంగుండు నిగమములతో గూడ నంతర్థానము నొందెను. శంకరయతిచంద్రుండు నతి విస్మితస్వాంతుడై యా వృత్తాంతమునే ధ్యానించుకొనుచు నంతేవాసి సంతతితోడ గంగానదికింజని స్నానాది నిత్యకృత్యములం దీర్చుకొని యా వసధంబుజేరి సనందనునితో నిట్లనియె. వత్సా! సనందన! సనకసనందనాది వందిత చరణారవిందుఁడగు నిందుమౌళియు సూత్రభాష్యము రచియింపుమని స్వయముగా నానతిచ్చెను. వ్యాసభట్టారకు నభిలాషయు నట్లెయున్నదనివింటి. గురునానతి మునుపే ప్రేరేపించుచున్నది. కావున నిఁకభాష్యము రచింపవలయు. అందులకు బదరికారణ్యము కడు బవిత్రమైనది. అది యేకాంతప్రదేశము. అందలి మహర్షులీ కార్యంబునకు సహాయ్యము సేయుదురని పలుకుచు శుభముహూర్తంబున శిష్యులతో