పుట:కాశీమజిలీకథలు-05.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

కాశీమజిలీకథలు - ఐదవభాగము

    నా తండ్రి నిన్నుఁ బన్నగశిరోభూషణుం
              డల్పాయువుగఁజేసె నయ్యయిట్టు
    లయ్యయో నీ విద్యలన్ని యేమైపోవు
             నేనేమి సేయుదు నింకమీఁద
    నీ తండ్రితో నేను నిన్నూతగాఁగొని
             యరుగంగలేనైతి నమరపురికిఁ.

గీ. గన్నతండ్రివేడ్క గదుర నీ ముద్దు ము
    చ్చటలఁ జూచుకొనుచు జాలకాల
    మలరఁదలఁచుకొంటి నకట నీ నెత్తిపై
    మృత్యువుంటఁ దెలిసి మెలఁగనైతి.

చ. కపటవరంబులిచ్చి మము గారియఁబెట్టఁగనేల చిత్తభూ
    రిపుడు దయాళుఁడిట్టి విపరీతముఁజేయునె మత్పురాత్త్వ పా
    పపుఫలరీతిగాక కులపావన! ముప్పదియేండ్లె నీకుఁ గ
    ల్పపు తుదియయ్యెనే యకట పాడువిధీ యిటుసేయుదే ననున్.

చ. చిరుతతనంబున ధృతిన శేషకళావిభవంబుగాంచి య
    బ్బురమగు కార్యముల్సలిపి భూజను లన్సువివేకతా ధురం
    ధరులుగఁ జేసినట్టి యవతారశరీరుఁడు తల్లి మోహ సా
    గరమున మున్గికొట్టికొనఁగా దరిజేర్పక మోహమందునే.

శంకరుఁడు తల్లికి వైరాగ్యోపదేశము చేయుట

శ్లో. ప్రబలానిలవేగ వేల్లితధ్వజచీనాంశుశకోటిచంచలె
    అపిమూడమతిః కళేబరెకురు తెకస్స్థిరబుద్ధిమంబికె
    కతినామసుతానలాతితాః కతివానేహవధూరభుంజ్మ హి
    క్వను తెక్వచకాః క్యవానయంభవసంగః ఖలుపాంధసంగమః.

అమ్మా! ప్రబలవాయువుచేఁ కొట్టికొను ధ్వజపటమువలె జంచలమగు నీ కళేబరమున స్థిరబుద్ధి యునుటచుకంటె మూఢత్వము గలదా. ఇంతకు వెనుకటి జన్మముల నీకు నావంటిపుత్త్రు లెందరు జనియించిరి. ఎందఱకు దల్లివైతివి. ఎందఱం బెంచితివి. వారందరిలో నేనొకండ. నెందరికొఱకు విచారించెదవు. మార్గస్థులు పానీయశాల కరుదెంచినట్లు సంసారులు చేరుచుం బోవుచుందురు. మమత్వమున సంసారసాగరమున మునింగి విషయసుఖగ్రాహగ్రస్తుండగు దేహియధోగతిం బొరయును. తల్లీ! నీ దేహమే నీకెరవగుచుండ నా కొఱకు విచారించెదవేల? దేహతత్త్వం బెరుంగుము.