పుట:కాశీమజిలీకథలు-05.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

321

    వగవకట వేడ్కఁ బూర్వంబువలె మెలంగు
    దురొ యటులు సేయు మిదియ నాకరయ హితము.

క. నాదగు భవనాంగణమున
   బోదివెలయనొప్పు చూతపోతకమునకుం
   బైఁ దనరు మాధవీలత
   కాదరమునఁ బెండ్లి సేయు మనుకొనినగతిన్.

సీ. పడకటింటను దలప్రక్కఁగట్టిన కామ
           పటము వ్రక్కలుచేసి పారవేయు
    యువిద! ముద్దుగఁ బెంచుచున్న నా లేడిపి
          ల్లను విడు మొక తపోవనమునందు
    గలికి! నా క్రీడానగము నాశ్రమము గాఁగ
          నర్పింపు మొక్క మహాతపస్వి
    కలివేణి! శుకశారికల స్వేచ్ఛ విహరింప
          విడువుము నా మేని తొడవులెల్ల

గీ. విప్రకాంతల కిమ్ము నా వీణ నీవు
    పుచ్చుకొని పాడుకొనుచుండు మిచ్చవచ్చి
    నట్లు చేయుము తక్కిన యన్ని వస్తు
    వులును నాకుఁ బ్రియంబుగాఁ జెలియ నీవు.

చ. రమణి! మదీయపాదతల రంజితమైన యశోకభూజపో
     తము జిగురించె నిప్పుడది తత్కిసలంబుల నేరుకణన్ పూ
     రమునకు నైన ముట్టుకొనరాదు సుమీ! మరిమాలతీలతా
     సుమముల దేవతార్చనకేసూ ! లవనం బొనరింపఁగాఁదగున్.

క. ఆ వనిమానుషి తాపసిఁ
   బో విడువుము కానకేను బోషించెడు నా
   జీవం జీవక మిధుము
   గావంగాఁదగును కేళికాశైలమునన్.

మరియు నాపాదసహచారి యగు హంసకమున కొకరివలన నపాయము లేకుండ రక్షించుచుండుము. ప్రాణసఖి! నీవే నాకుఁ బుత్రుండవై పరలోకగతనగు నాకుఁ జలాంజలు లొసంగుచుండుము. నే నీచంద్రాపీడుని కంఠమును గౌఁగిలించుకొని ప్రాణం