పుట:కాశీమజిలీకథలు-05.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

311

తపమనుకొని అయ్యో! యిట్లు పలికెదరేల? చంద్రాపీడుని దాపునకు రారాయని నిర్బంధముగా బెక్కుసారు లడిగిన నతం డిట్లనియె.

అక్కటా! మీరూరక నన్ను నిర్బంధించెదరేల? చంద్రాపీడుని జీవితముతోడు! నాకేమియుఁ దెలియకున్నది. నేను వచ్చుటకు సమర్ధుఁ డనుకాను. కారణము నాకుఁ దెలియదు. మీరు చూచుచునే యడిగెదరేల? మీరు పొండు పొండని పలికి ముహుర్తకాల మూరుకొని యందు రమ్యములైన లతాగృహములు సరస్స్తీరములు గ్రుమ్మరుచు నాదేవాయతనమున నెద్దియో మరచిపోయినట్లు వెదకుచు నితరదృష్టి లేక తిరుగుచుండెను..

మేము పొదలమాటుననుండి రెండుయామములవరకు నతని చేష్టలం గనిపెట్టి తిరిగిపోయి రమ్మని నిర్బంధింప నతఁ డయ్యో! నన్నిట్లు వేపెదరేల నాకు నా జీవితముకన్నఁ జంద్రాపీడుని ప్రాణములు ప్రియములు కదా! అని యతని విడిచి బలాత్కారముగా నాయొద్దకు వచ్చినను గార్యము లేదని తోచుచున్నది. ఇంక మీరేల వేడెదరు? పొండని పలికి లేచి యందు స్నానము చేసి కందమూలఫలము లాహారముగా బుచ్చుకొని వనవాసోచితవ్యాపారమును గైకొనియెను.

అప్పుడు మేము విస్మయమందుచు మూఁడహోరాత్రములు వేచి యుంటిమి కాని యతనిబుద్ధి తిరిగినది కాదు. అప్పుడు నిరాశులమై యందుఁ గొందర గావలియుంచి మేము బయలదేరి వచ్చితిమి

అని యెరింగించిన వారి మాటలు విని చంద్రాపీడుఁడు చింతావిస్మయము లొక్కమాటు చిత్తం బుత్తలపెట్ట నిట్లు తలంచెను.

అయ్యో! వైశంపాయనుని నింతలో వైరాగ్యవృత్తి బూనుటకుఁ గారణ మేమియుం గనంబడదు. తారాపీడుఁడు నన్నుఁవలె వానినిసైతము గారవించును. ప్రజలకు సైతము నాయందుకన్న వానియందే మిక్కుట మగు మక్కువ గలిగియున్నది. శుకనాశుఁడు మనోరమయు నతని నేవిషయములోను మందలించి యెరుఁగరు. అతనికిఁ బ్రశాంతికైన నిది సమయముకాదు ఇదివరకు విద్వజ్ఞనోచితఁమైన గార్హస్థ్యమందే ప్రవేశింపలేదు. ఇది యేమియో యని పెక్కుతెరంగులఁ దలంచుచు నతివేగముగా నచ్చోటికి బోవఁదలంచియు తల్లిదండ్రుల కెఱిగింపక పోరాదని నిశ్చయించి యప్పుడే తురగమెక్కి యత్యంతరయంబునఁ దనపట్టణమునకు వచ్చెను.

ఆ వీటిలో ప్రజలందరు గుంపులుగాఁ గూడుకొని వైశంపాయనుని వృత్తాంతమే చెప్పుకొనువారును, వినువారును, అడుగువారును, విచారించువారునై వీథులయం దుండుటఁ జూచి చంద్రాపీడుఁడు అక్కటా! యీవార్త నాకన్న ముందర పట్టణములోనికి వచ్చినది. మాతండ్రిగారికిని శుకనాశునికిగూడఁ దెలిసియేయుండును. వైశంపాయనునిగురించి బాహ్యజనంబే యింత విచారింపుచుండఁ దల్లిదండ్రుల కెట్లుండునో? నన్నేమని శంకింతురో యని పెక్కుతెరంగులఁ దలపోయుచుఁ గ్రమంబున