పుట:కాశీమజిలీకథలు-05.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

307

కార్యసిద్ధి హస్తగతమయినదానిగా భావింపుము. నా బ్రాణమిత్రుఁడు వైశంపాయనుఁడు వచ్చుచున్నవాఁడని పలికెను.

పిమ్మట గేయూరకుఁడు ఆ రాజకుమారునికి మ్రొక్కుచు దేవా! దేవర వైశంపాయనుఁడు వచ్చువరకుఁ గాలక్షేపము చేయదగియే యున్నది. ఆచ్చటిసంగతి మీకు విశదపరచితినికదా! దేవర తత్సందేతాపము గ్రహించిరి. కావున నన్ను ముందు బంపుఁడు. నేను బోయి భవదీయవృత్తాంతమంతయు నా కాంత కెరింగించి జీవనధారణోపాయ మాకలించెద. మీవార్తాశ్రవణ మూతగాఁ బూని యానెలంతఁ బ్రాణములు ధరించు ననుగ్రహింపుఁడని పలుకగావిని యారాజనందనుండు వెనుకగూర్చుని యున్న పత్రలేఖం జూచుచు మేఘనాథుఁ డెక్క డనని యడిగెను.

అంతలో మేఘనాథుం డెదుర నిలఁబడుటయు నతనిం జూచి యోరీ! నీవు వెనుక పత్రలేఖం దీసికొనివచ్చుట కెందుంటివో యిప్పు డచ్చట కీపత్రలేఖం దీసికొని కేయూరకునితోఁగూడ ముందుగాఁ బొమ్ము. నేనును వైశంపాయనునితో మాట్లాడి వెనుక వచ్చెదనని నియమించి కేయూరకా! నీవు కాదంబరీసందేశము నాకుఁ దీసికొనిరాలేదు. నేనే నీచేత నామెకు సందేశము పంపుచుంటిని ఆశీకమగు సిగ్గుయొక్క భారమును వహించుటచే నిన్నా యాసపెట్టుచున్నాను. అని దేవితో విజ్ఞాపన చేయుము తక్కిన సంగతులన్నియుఁ బత్రలేఖ యెరింగింపఁగలదు. అని పలుకుచు నమంగళశంకచే నశ్రుజలంబు నరికట్ట యత్నించుటయు నాపలేక కన్నీరుగార్చుచుఁ దనపాదంబులకు నమస్కరింపుచున్న పత్రలేఖ దిక్కు మొగంబై యంజలిపట్టి యిట్లనియె.

పత్రలేఖా! ఈ యంజలితో మత్శిరప్రణామము లర్పించి కాదంబరి కిట్లు విజ్ఞాపన జేయుము. దయగలదగుట ప్రధమదర్శనమందే యనుగ్రహాతిశయమునుఁ జూపిన యామెను నమస్కారము చేతనైన గౌరవింపక విడిచివచ్చిన కృతఘ్నుండనగు నా సుగుణమేదిజూపి తిరుగాఁ బరిగ్రహింపుమని ప్రార్ధింతును. ఆమెమాత్ర మెట్లంగీకరించును? ప్రకృతిపేశలమగు నామె హృదయమపహరించి వెళ్ళలేదనియా? ప్రాణ సంకటమగు నవస్థ జూచియు నుపేక్ష చేయలేదనియా! సర్వదోషాశ్రయుఁడ నైనను బలుమారామె పాద సేవ జేసితిననియా? సర్వగుణవిహీనుండనైనను నామె సుగుణంబులే నన్నవలంబించునని యాసగలిగి యుంటిని. పాదపతితుండనగు నన్ను దత్వాత్సల్యము భయపెట్టఁదని తలంతును. సిగ్గులేనివాఁడనై తిరుగా నామె మొగంబు జూచుటకు యత్నించుట తత్సుగుణంబులే కారణములు. ఆమె సెలవులేకయే దూరముగా వచ్చిన నన్ను బలాత్కారముగాఁ దత్సుగణములే వెండియు నామె పాదమూలమును జేర్చుచున్నవి. ఇష్టములేని గమనాజ్ఞచే వెడలిపోయితినని యేహక్కుచే విజ్ఞాపన జేసికొనుచుంటినో ఆ వాక్కే నీ కిట్లు చెప్పుచున్నది. ఇటుపైన మదాగమన మెట్లు వ్యర్థముగాదో జగమెట్లు శూన్యముగాదో యట్లు దేవి యాత్మ నిలుపుకొనుట కాత్మచేతనే యత్నము చేయవలయును. అని చెప్పుమని చెప్పి వెండియు నతండు ప్రియ