పుట:కాశీమజిలీకథలు-05.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

297

గూర్చుండఁబెట్టుకొని పరిజనులెల్ల వెరగుపాటుతోఁ జూచుచుండఁ గరికిసలయమున స్పృశించుచుండెను.

చంద్రాపీడుండు నట్టి యవస్థ నున్నఁ గాదంబరిం జూచి అయ్యో? నా హృదయమింత మొద్దువారినదేమి? యిప్పుడుకూడ సందేహమే చెందుచున్నది. కానిమ్ము. నేర్పుగా నడిగి తెలిసికొందునుగాక. అని తలంచి ప్రకాశముగా నిట్లనియె.

దేవీ! ఆవిళసంతాప తీవ్రంబగు నీ వ్యాధి నీకెట్లు కలిగినది? భవదంగభవపరితాపంబు జూడ సత్యము జెప్పుచున్నాను. నీకంటె నన్నెక్కుడుగా బాధించుచున్నది. పెక్కేల? దేహమిచ్చియైన నిన్ను స్వస్థురాలిగాఁ జేయఁదలచుకొంటి నిందులకు నా హృదయము మిక్కిలి తొందరపడుచున్నది. అయ్యయ్యో? మన్మథునికి శరీరభూతములగు నీభుజలతను సంతాపదృష్టులచే గందజేయుచుంటివి? అశ్రుబిందుపాతంబున ముక్తాభరణత్వము గలిగి యొప్పుచుంటివి. పరార్హములగు మంగళప్రసాదనముల వహింపుము. నవలత సకుసుమశిలీముఖయై శోభించునుగదా? అని యడిగిన విని కాదంబరి బాలయు స్వభావముగ్ధయునైనను గందుర్పునిచే నుపదేశింపబడిన ప్రజ్ఞచేఁ దద్వాక్యము లందలి శ్లేషార్ధమును గ్రహించియు నేమియుఁ బ్రత్యుత్తర మీయక యన్యాపదేశముగా మందహాసము గావించినది అప్పుడు మదనలేఖ రాజకుమారా! ఏమందును. ఈ సుందరి సంతాప మకథనీయమై యున్నది. సుకుమారభావముతోఁ గూడిన యీచేడియ కేది సంతాపము గాకుండెడిది? పద్మినికి వెన్నెలయు నెండగా నుండునుగదా? కిసలయతాళవృంతమున విసరుకొనుచున్న యీ పూఁబోడి మనోభవఖేద మేమిటికి తెలిసికొనజాలవు? ఈమెకు ధీరత్వమే ప్రాణసంధారణహేతువు. అని ప్రత్యుత్తర మిచ్చుటయు నాయాలాపములే యతని మాటలకు సరిపడియున్నవని కాదంబరి హృదయంబునం దలంచినది.

చంద్రాపీడుండు నమ్మాటలయందుఁగూడ నర్ధద్వయము గలిగియుండఁబట్టి తన డెందంబున గలిగిన సందియము దీరమింజేసి పరిపరివిధంబులం దలంచుచుఁ బ్రీత్యుపచయచతురములు మధురాలాపగర్భములు నగు కథలచే మహాశ్వేతతోఁగూడఁ కొంత గాలక్షేపము జేసి యతిప్రయత్నముతో నామెను విడిచి స్కంధావారమునకుఁ బోవుటకు బయలుదేరెను.

గుర్రమెక్కఁబోపు సమయంబున గేయూరకుం డరుదెంచి దేవా? మదనలేఖ యిట్లు విజ్ఞాపనజేయుచున్నది. ప్రథమదర్శనప్రీతిచేఁ బత్రలేఖ నిందుంచి వెళ్ళమని కాదంబరి కోరుచున్నది. వెనుక నంపఁగలదు. దేవర చిత్త మే మనవుఁడు రాజనందనుఁడు కేయూరకా! మాపత్రలేఖ ధన్యురాలు. దుర్లభమైన దేవీప్రసాదమునకుఁ బాత్రురాలగు