పుట:కాశీమజిలీకథలు-05.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అతఁడు నమస్కరించుచు దేవా! క్రీడాపర్వతము క్రిందుభాగమునఁ గమలవనదీర్ఘికాతీరంబున రచింపఁబడిన హిమగృహంబున వసించియున్నదని యెరింగించెను. ఆ మాటవిని కేయూరకుఁడు ముందు నడుచుచు మార్గము దెలుపఁ బ్రమదవనము నడుమనుండి పోవుచు నందలి కదళీవనప్రభలచే రవికిరణంబులు పచ్చనగుట వింతగాఁ జూచుచు నవ్వనమధ్యంబున నళినీదళములచేఁ గప్పఁబడిన హిమసదనంబు చెంత కరిగెను.

సీ. లలితమృణాళదండములును బిసంతంతు
          మయములై యొప్పుచామరల బూని
    కదళీదళంబులు కమలినీపత్రముల్
          బూలగుత్తులు ఛత్రములుగఁ బట్టి
    మలయజరసముతో మెలసి మర్దించిన
          కర్పూరధూళి పంకంబు దాల్చి
    తతకేతకీగర్భదళదీపితతమాల
          కిసలయమాలికల్ కేలబూని.

గీ. చెలులు శైత్యోపచారము ల్సేయుచుండ
    హిమగృహంబునఁ బుష్పతల్పంబునఁ బండుఁ
    కొని దురంతవియోగవేదన దపించు
    చిత్రరథపుత్రిఁ గాంచె నాక్షితిపసుతుఁడు

అంతకుముందుగాఁ బోయి తదాగమన మెరింగించుచున్న పరిజనముతో ఆ! ఏమీ? నిజముగా నతండు వచ్చెనా? మీరు చూచితిరా? ఎంతదూరములో నున్నవాఁడని యడుగుచుండఁగనే యతండు గన్నులంబడుటయుఁ దొలిచూపులతనిపై వ్యాపింపఁ జేయుచు జారిన యుత్తరీయాంశుకము హారమును నురంబున సవరించుచు నా విరిబోఁడి పూసెజ్జనుండి యట్టె లేచినది.

చంద్రాపీడుండును సమీపించి పూర్వమువలెనే మహాశ్వేతకుఁ గాదంబరికి నమస్కారములు గావించెను. కాదంబరి ప్రతిప్రణామము గావించి యాపుష్పశయ్య యందుఁ గూర్చుండెను. అప్పుడు ప్రతిహారి జాంబూనదపీఠంబొండు దెచ్చి వైచుటయు నది కాలితో ద్రోసి చంద్రాపీడుండు వినయ మభినయించుచు నేలయందే కూర్చుండెను.

అప్పుడు కేయూరకుఁడు దేవీ! ఈ చిన్నది యీ రాజకుమారుని తాంబూలకరండవాహిని, యీమెపేరు పత్రలేఖ. వీరికి మిక్కిలి యనుగ్రహధాత్రియని యెరింగించెను. కాదంబరియు నాకన్యంజూచి యోహో! మానవస్త్రీలయందుఁ బ్రజాపతికింత పక్షపాతమున్నదా? అని తద్రూపాతిశయమున కచ్చెరువందుచు నమస్కరింపుచున్న యాయన్నుమిన్నను రమ్మురమ్మని సాదరముగాఁ బిలుచుచుఁ దన వెనుకప్రక్కం